పెళ్ళైన రెండు నెలలకే శోభిత సంచలన నిర్ణయం..!

అక్కినేని నాగ చైతన్య సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ నాల్గవ తేదీన వీళ్లిద్దరి వివాహం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. ఎక్కడికి వెళ్లినా వీళ్లిద్దరు కలిసే వెళ్తున్నారు. శోభిత తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు అక్కినేని అభిమానులను షాక్ కి గురి చేసింది.
శోభిత అక్కినేని కుటుంబం కోసం సినిమాలకు ఇక నుండి దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట. రీసెంట్ గా పలువురు బాలీవుడ్ దర్శకులు తమ సినిమాల్లో హీరోయిన్ గా తీసుకునేందుకు ఈమెని సంప్రదించగా సున్నితంగా తిరస్కరించి పంపేనట్లు సమాచారం. నాగ చైతన్య నుండి కానీ, అక్కినేని కుటుంబం నుండి కానీ శోభిత సినిమాల్లో నటించకూడదు అనే కఠినమైన నియమాలేవి పెట్టలేదు. కానీ భవిష్యత్తులో పిల్లల్ని కనే ఉద్దేశ్యం ఉన్నందున సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. పిల్లలు పుట్టిన తర్వాత, కొన్నేళ్లు గడిచాక నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు దొరికితే నటించేందుకు ఆలోచిస్తానని చెప్పిందట.