విశాల్ తో పెళ్ళి వార్తలో నిజం లేదు.. ఆయనతో నా పెళ్లి : హీరోయిన్ అభినయ

Wednesday, January 29, 2025 10:45 PM Entertainment
విశాల్ తో పెళ్ళి వార్తలో నిజం లేదు.. ఆయనతో నా పెళ్లి : హీరోయిన్ అభినయ

రవితేజ నటించిన 'నేనింతే' సినిమాతో నటి అభినయ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు 'శంభో శివ శంభో'తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. విశాల్‌తో పెళ్లి, ప్రేమ రూమర్స్‌పై ఆమె స్పందించారు. ఒక యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. పుట్టుకతో దివ్యాంగురాలైన అభినయ సైన్‌ లాంగ్వేజ్‌తో పలు విషయాలు పంచుకున్నారు. విశాల్‌తో పూజా చిత్రంలో మెప్పించిన అభినయ మార్క్‌ ఆంటోని మూవీలో ఆయనకు భార్యగా నటించారు. ఆమెలో నటన పరంగా చాలా టాలెంట్‌ దాగి ఉందని పలుమార్లు విశాల్ వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ ప్రేమలో ఉన్నారని చాలాసార్లు వదంతులు వచ్చాయి.

దీంతో పలు వేదికల మీద ఇప్పటికే వారిద్దరూ ఖండించారు. అభినయతో విశాల్ పెళ్లి అనే వార్తలు ప్రచారంలోనే ఉన్నాయి. త్వరలో పెళ్లి అంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఈ విషయంలో ఎలాంటి నిజం లేదని అభినయ తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో తన సైన్‌ లాంగ్వేజ్‌లో పంచుకున్నారు. తాను 15 ఏళ్లుగా కలిసి చదువుకున్న స్నేహితుడిని ప్రేమిస్తున్నానని, త్వరలో అతడిని పెళ్లి చేసుకోబోతున్నానని ప్రకటించారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: