ఐటీ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన సుకుమార్.. 531 కోట్లు ఏమయ్యాయి?

Wednesday, January 22, 2025 10:49 PM News
ఐటీ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన సుకుమార్.. 531 కోట్లు ఏమయ్యాయి?

చిత్ర నిర్మాతలపై దాడులు కొనసాగిస్తున్న ఐటి అధికారులు బుధవారం పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో సోదాలు మొదలు పెట్టారు. ఉదయం ప్రారంభమైన ఈ ఐటీ సోదాల్లో సంచలన నిజాలు బయటపడ్డాయి. పుష్ప 2 చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో లాభాలు వచ్చాయని, బయట వెల్లడించిన వసూళ్లకు, వాస్తవంగా వచ్చిన వసూళ్ళకి రూ.531 కోట్ల తేడా ఉందని గుర్తించినట్లు సమాచారం.

డైరెక్టర్ సుకుమార్ లాభాల్లో వాటాలు పంచుకున్నాడని, వాటికి సంబంధించి పన్నులు సరిగా చెల్లించలేదని అధికారులు చెబుతున్నారు. నిన్నటి నుండి సోదాలు నిర్వహిస్తున్న చోట్ల అనేక లెక్కలు దొరికాయని, వాటికి ఆదాయ పన్ను కట్టలేదని వార్తలు జోరుగా వస్తున్నాయి. రేపు హీరో అల్లు అర్జున్ పై కూడా సోదాలు నిర్వహించబోతున్నట్టు సమాచారం.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: