దిల్ రాజుకు 1800 కోట్ల ఆదాయం.. పన్ను ఎంత కట్టారంటే..

Saturday, January 25, 2025 12:00 PM Entertainment
దిల్ రాజుకు 1800 కోట్ల ఆదాయం.. పన్ను ఎంత కట్టారంటే..

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు ముగిసాయి. సోదాల తర్వాత దిల్‌రాజును శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయానికి తరలించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్‌ కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. రెండేళ్లుగా నిర్మించిన చిత్రాల వ్యయం, ఆదాయాలపై ఆరా తీస్తున్నారు. నాలుగు రోజుల పాటు జరిగిన ఐటీ సోదాల్లో కీలక అంశాలను గుర్తించారు. వచ్చిన లాభాలకు కట్టిన ట్యాక్స్‌కు వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. అలాగే సంక్రాంతికి వచ్చిన సినిమాల కలెక్షన్లపై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు. దిల్‌రాజు ఇంట్లో కీలక పత్రాలను ఐటీ అధికారులు సీజ్ చేశారు. దిల్‌రాజు కార్యాలయంలో కూడా ముఖ్యమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. దిల్ రాజ్ ఇళ్లు, కార్యాలయంతో పాటు కూతురు హన్సితా రెడ్డి ఇంట్లో సీజ్ అయిన పత్రాలను అధికారులు పరిశీలించారు.

గత రెండేళ్లుగా దిల్‌రాజు నిర్మించిన సినిమాలకు సంబంధించి కొంత సమాచారాన్ని ఐటీ అధికారులు సేకరించారు. రూ.1800 కోట్ల ఆదాయం వచ్చినప్పటికీ పన్నుల చెల్లింపులు తక్కువగా ఉన్నట్లు ఐటీ నిర్ధారించింది. నాలుగు రోజులుగా 18 ప్రదేశాల్లో 55 మంది బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహించారు. టాలీవుడ్‌లో ఎప్పుడూ లేని విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీపై ఐటీ దాడులు చేసింది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: