సైఫ్ పై దాడి: ఎటాక్ చేసింది దొంగ కాదు.. ప్రియుడు

Monday, January 27, 2025 01:12 PM Entertainment
సైఫ్ పై దాడి: ఎటాక్ చేసింది దొంగ కాదు.. ప్రియుడు

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై జరిగిన దాడి విషయంలో రోజుకో ట్విస్ట్ బయట పడుతోంది. ఇప్పటికే ముంబై పోలీసుల అదుపులో ఉన్న మహ్మద్ షెహజాద్ అసలు నిందితుడు కాదని, సైఫ్ ఇంట్లో లభించిన వేలి ముద్రలకు ఆ నిందితుడికి ఎలాంటి మ్యాచింగ్ లేదని పోలీసులు తెలిపారు. 

ఈ విషయంలో ఓ షాకింగ్ విషయం బయటికి వచ్చింది. విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ సైఫ్‌పై జరిగిన దాడి విషయంలో తనకు తెలిసిన విషయం ఇది అంటూ ఓ ట్వీట్ చేసాడు. సైఫ్‌పై దాడి జరిగిన సమయంలో కరీనా ఇంట్లో లేదని, ఆమె పార్టీకి వెళ్లిందని, అదే సమయంలో సైఫ్ తన ఇంట్లోని ఓ పని మనిషితో ఏదో విషయం గురించి మాట్లాడుతుండగా ఆ పనిమనిషి ప్రియుడు అప్పుడే ఇంట్లోకి వచ్చాడని పేర్కొన్నారు. వారిద్దరూ కూర్చుని మాట్లాడుకోవడం చూసి అతనికి ఒళ్లుమండి కత్తితో సైఫ్‌పై దాడి చేసాడని, కత్తి విరిగి సైఫ్ వెన్నెముకలో గుచ్చుకోవడంతో అతను ఆగాడు కానీ లేదంటే మరిన్ని కత్తిపోట్లు పడేవని కమల్ ఆ ట్వీటులో పేర్కొన్నారు. ఇదంతా బయటికి తెలిస్తే పరువు పోతుంది కాబట్టి చోరీ కథ అల్లినట్లు తనకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని తెలిపాడు. అందుకే దాడి చేసిన వ్యక్తి పారిపోతున్నప్పుడు సీసీ కెమెరాలో కనిపించింది కానీ లోపలికి వెళ్తున్నట్లు ఎక్కడా లేదని.. సైఫ్‌ని హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నప్పుడు కూడా సీసీ ఫుటేజీలు బయటపెట్టడంలేదని ఆయన ఆరోపించారు. 


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: