సమంతతో విడాకులపై నాగ చైతన్య కీలక వ్యాఖ్యలు
_(23)-1739070224.jpeg)
హీరో నాగచైతన్య తన మాజీ భార్య సమంతతో విడాకుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకోవడం రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదని, అనేక రోజుల చర్చల తర్వాత మాత్రమే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. తమ విడాకుల అంశం ఇతరులకు వినోదంగా మారడం గురించి అసహనం వ్యక్తం చేసారు. తనపై అనవసరమైన నెగెటివ్ కామెంట్లు చేసిన వారు మరొకసారి అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని విజ్ఞప్తి చేశారు.
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి పీఆర్ లను నియమించుకుంటున్నారని చెప్పారు. తాను పీఆర్ గేమ్ లోకి ఆలస్యంగా వచ్చానని పేర్కొన్నారు. ఉన్న రంగంలో రాణించాలంటే కొన్ని పనులు చేయక తప్పదన్నారు. గత రెండేళ్ల నుంచి పీఆర్ యాక్టివిటీ పెరిగినట్లు చైతన్య తెలిపారు. ప్రతి నెల కనీసం రూ. 3 లక్షలు పెట్టకపోతే ఈ రంగంలో సరైన దారిలో వెళ్ళే అవకాశం లేదని చెప్పారు. సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడుకునేలా చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.