నా బట్టలు నా ఇష్టం.. సింగర్ దామిని

దామిని బట్ల సింగర్ గా ఎన్నో అద్బుతమైన పాటలు ఆలపించటంతో పాటు అందంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పాడుతా తీయగా, సరిగమ లిటిల్ చాంప్స్ వంటి షోలతో ఫెమస్ అయిన దామిని సింగర్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంది. 2014లో సింగర్ గా కెరీర్ గా మొదలు పెట్టింది ఈ చిన్నది. లవ్ ఇన్ లండన్, బాహుబలి ది బిగినింగ్, మనసంతా ఇలా చాలా సినిమాల్లో పాటలు పాడి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఓ ఇంటర్వ్యూలో దామిని మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడింది. అలాగే బిగ్ బాస్ లో తన అనుభవాల గురించి కూడా చెప్పింది. వీటితో పాటు తన పై వచ్చిన ట్రోల్స్ గురించి కూడా తెలిపింది. నా బాడీ నా ఇష్టం, నా బట్టలు నా ఇష్టం నేను ఇలానే ఉంటాను. నేను ఎలా ఉన్నా కామెంట్స్ చేసేవాళ్లు చేస్తూనే ఉంటారు. పాజిటివిటీని నెగిటివ్ గా చూసి స్ప్రెడ్ చేసేవారు చాలా మంది ఉంటారు అలాంటివాటిని, అలంటి వారిని పట్టించుకోకపోవడమే బెటర్ అని తెలిపారు.