హై బీపీతో ఆసుపత్రిలో చేరిన పృథ్వీ

Tuesday, February 11, 2025 10:31 PM Entertainment
హై బీపీతో ఆసుపత్రిలో చేరిన పృథ్వీ

మూడు రోజుల క్రితం లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినీ నటుడు పృథ్వి వైసీపీ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. "నేను మేకల సాత్తిగా చేశాను..మేకలు ఎన్ని ఉన్నాయని షార్ట్ మధ్యలో అడిగితే 150 ఉన్నాయని చెప్పారు. యాదృచ్ఛికమో ఏమో కానీ సినిమా చివర్లో లెక్కిస్తే కరెక్ట్ గా 11 గొర్రెలే ఉన్నాయి" అని వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలకు, అభిమానులకు కోపం తెప్పించాడు.

అనుకున్నట్లుగానే వైసీపీ అభిమానులు బాయ్ కాట్ లైలా అంటూ కొత్త ట్రెండ్ ను మొదలుపెట్టారు. పృథ్వీ చేసిన పనికి విశ్వక్ సేన్ సారీ చెప్పాడు. తన సినిమాను చంపేయకండి అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే పృథ్వీ హాస్పిటల్ పాలవ్వడం మరింత సంచలనంగా మారింది. హైబీపీ కారణంగా పృథ్వీని హాస్పిటల్ లో చేర్పించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. పృథ్వీ హాస్పిటల్ లో ఉన్నా కనికరించేది లేదని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అదంతా డ్రామా అని చెప్పుకొస్తున్నారు. మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు అడగాల్సి వస్తుందని పృథ్వీ ఇలా డ్రామాలు మొదలుపెట్టాడని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: