కెరీర్ పై మిల్కీ బ్యూటీ హాట్ కామెంట్స్
Saturday, April 5, 2025 10:30 PM Entertainment
_(20)-1743872402.jpeg)
తన కెరీర్ గురించి మిల్కీ బ్యూటీ తమన్నా హాట్ కామెంట్స్ చేశారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'ఓదెల 2' విడుదలకు సిద్ధమైంది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్ పై వ్యాఖ్యలు చేశారు. యాక్టింగ్ ను తాను కేవలం వృత్తిగానే చూడలేదని తెలిపారు. ఎప్పుడూ దానిని కష్టం అనుకోలేదని, ప్రతి విషయాన్ని ఎంజాయ్ చేశానని చెప్పారు.
తమన్నా 'చాంద్ సా రోషన్ చెహ్రా' (2005)తో నటిగా తెరంగేట్రం చేశారు. సుమారు 20 ఏళ్ల సినీ కెరీర్ లో వివిధ భాషల్లో ఆమె ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: