తండ్రి కాబోతున్న హీరో కిరణ్ అబ్బవరం
Tuesday, January 21, 2025 03:48 PM Entertainment
టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం శుభవార్త చెప్పారు. తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన భార్య రహస్య గోరక్ బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ‘మా ప్రేమ రెండడుగుల మేర పెరుగుతోంది’ అంటూ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన అభిమానులు, నెటిజన్లు, సెలబ్రిటీలు కిరణ్ అబ్బవరం-రహస్య గోరక్ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కిరణ్ అబ్బవరం – రహస్య గోరక్ గతేడాది ఆగస్టులో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ‘రాజావారు రాణిగారు సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఇక తొలి సినిమాతోనే కిరణ్, రహస్య గోరక్ ప్రేమలో పడ్డారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే మొదట్లో స్నేహితులుగా ఉన్నా.. ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారింది.
For All Tech Queries Please Click Here..!
Topics: