కిడ్నీ వ్యాధిని తెలియజేసే 8 లక్షణాలు..

కిడ్నీలు మన శరీరంలో చాలా ముఖ్యమైన పనులు చేస్తాయి. రక్తం నుంచి వ్యర్థాలు, విష పదార్థాలు, ఎక్కువ నీటిని ఫిల్టర్ చేసి, మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. రక్తపోటును నియంత్రించడంలో, ఎలక్ట్రోలైట్‌లను సమతుల్యం చేయడంలో, ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతాయి. కిడ్నీ వ్యాధులు ఎప్పుడూ సైలెంట్‌గా వస్తాయి. వీటిని ముందు గానే గుర్తించడం చాలా ముఖ్యం. ఈ ఎనిమిది లక్షణాలు మీలో కనిపిస్తే కిడ్నీలు ఆరోగ్యంగా లేవని గమనించి వైద్యులను సంప్రదించండి..
1.కాళ్ళలో వాపు, కళ్ళ చుట్టూ ఉబ్బడం కనిపిస్తుంది.
2.కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే అధిక రక్తపోటు వస్తుంది. ఇది సాధారణ చికిత్సలకు నయం కాదు.
3.మూత్రంలో కొంచెం నురుగు సాధారణమే. ఎక్కువ నురుగు వస్తే అది కిడ్నీ దెబ్బతినడానికి ఒక సంకేతం.
4.ముదురు, టీ-రంగు మూత్రం ప్రమాదకరమైనది. ఇది తీవ్రమైన కిడ్నీ ప్రమాదాన్ని సూచిస్తుంది.
5.అప్పుడప్పుడు రాత్రిపూట మూత్ర విసర్జన చేయడం సాధారణం. కానీ ఇది తరచుగా ఉంటే అది కిడ్నీ వ్యాధి ప్రారంభ దశను సూచిస్తుంది.
6.కొన్ని రోజులు వాంతులు కిడ్నీ వైఫల్యం వల్ల రక్తంలో విష స్థాయిలు పెరగడం వల్ల అవుతాయి.
7.తీవ్రమైన, నిరంతర దురద కిడ్నీ దెబ్బతినడాన్ని సూచిస్తుంది.
8.మూత్రంలో రక్తం కిడ్నీ రాళ్ళు ఉండటాన్ని లేదా కిడ్నీ వ్యాధిని సూచిస్తుంది.