ఒక్క అరటి పండుతో ఇన్ని లాభాలా..?

Monday, February 24, 2025 07:01 AM Lifestyle
ఒక్క అరటి పండుతో ఇన్ని లాభాలా..?

అరటిపండులో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇందులో ఉండే పొటాషియం అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అలాగే అరటిలో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. రోజు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అంతేకాకుండా మెగ్నీషియం, విటమిన్ B6, ఫాస్పరస్ వంటి విటమిన్లు, ఖనిజాల గని. అరటిపండు తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. అరటిపండ్లు కార్బోహైడ్రేట్లకు మూలం. గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ వంటి సహజ చక్కెరలు అరటిపండులో ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. ఇది ఎనర్జీ బూస్టర్‌లా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

అరటిపండు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అరటి పండులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ధమనులలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి బయటకు పంపడంలో సహాయపడుతుంది. అరటిపండు తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. అరటిపండ్లలో కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. దీన్ని తినడం వల్ల ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

అరటిపండ్లలో విటమిన్ బి6 ఉంటుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది మానసిక ఒత్తిడి, ఆందోళన, నిరాశను తగ్గించడంలో సహాయపడుతుంది. అరటిపండులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో పెక్టిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కడుపు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి అరటిపండు మంచి ఆప్షన్. రోజూ అరటిపండు మితంగా తింటే బరువు తగ్గవచ్చు.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: