ఖాళీ కడుపుతో పుదీనా తింటే లాభాలేంటో తెలుసా..?

వేసవి కాలం ప్రారంభమవుతోంది. అధిక వేడి కారణంగా ఆరోగ్య సంబంధిత సమస్యలు పెరుగుతాయి. కాబట్టి ఇలాంటి సమయాల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందుకు రోజువారీ ఆహారంలో పుదీనా చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పుదీనాలోని ఔషధ గుణాల కారణంగా పురాతన కాలం నుంచి ఆయుర్వేధంలో దీనిని ఉపయోగిస్తున్నారు.
దీని ముఖ్యమైన ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. పుదీనా ఆకులలో పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. పుదీనా ఆకులలో ఉండే పోషకాలు కొవ్వు స్థాయిలను తగ్గిస్తాయి. దీని రసం చేదుగా ఉన్నప్పటికీ అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. మీరు దీని రసం తాగలేకపోతే, రెండు, మూడు తాజా పుదీనా ఆకులను నమిలి తినవచ్చు.
పుదీనా ఆకులను రోజుకు రెండుసార్లు తింటే సరిపోతుంది. జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉండి, గ్యాస్, కడుపు నొప్పితో బాధపడేవారికి పుదీనా ఆకులు సంజీవనిగా పనిచేస్తాయి. ఈ ఆకులలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పుదీనా ఆకులు అమ్మాయిల్లో వచ్చే పీరియడ్స్ సమస్యలకు, కడుపు నొప్పి, మంట, వెన్నునొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. శరీరానికి విశ్రాంతిని ఇస్తాయి. నోటి నుండి ఎప్పుడూ దుర్వాసన వస్తుంటే పుదీనా ఆకులు ఈ సమస్యకు దివ్యౌషధంలా పనిచేస్తాయి. ఈ ఆకులను రోజూ తీసుకోవడం వల్ల నోటిలోని క్రిములు నశిస్తాయి. దుర్వాసన రాదు. ప్రతి ఉదయం మూడు లేదా నాలుగు తాజా పుదీనా ఆకులను నమిలితే ఆరోగ్య సమస్యలు మీ దరికి రావని నిపుణులు చెబుతున్నారు.