మీలో ఈ అలవాట్లు ఉన్నాయా.. అయితే చాలా డేంజర్
_(29)-1741052538.jpeg)
అందరికీ రోజూ చేసే కొన్ని అలవాట్లు ఉంటాయి. అవి మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. చాలా మంది ఎక్కువసేపు కూర్చుంటూ ఉంటారు. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల గుండెజబ్బులు, డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్లు, దీర్ఘకాలికవ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు ఎక్కువ సేపు కూర్చోవడం మంచిది కాదు.
చాలామంది ఆహారంలో అధికంగా చక్కెరను వినియోగిస్తూ ఉంటారు. దీనివల్ల ఊబకాయ బాధితులుగా మారుతారు. ఇన్సులిన్ నిరోధకత పెరగడంతో పాటు దంత క్షయం వంటి అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అధిక చక్కెర వినియోగం కూడా మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల అనేక దీర్ఘకాలికమైన వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు. ఇక చాలామంది పడుకునే ముందు స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్లు వంటి వాటిని ఉపయోగించడం అలవాటుగా ఉంటుంది. దీనివల్ల నిద్రలేమి సమస్య వస్తుంది. ఫలితంగా ఆరోగ్యం పాడవుతుంది.
కొంతమంది చాలా తక్కువగా నీటిని తాగుతూ ఉంటారు. నీటిని తక్కువగా తాగడం కూడా మన శరీరానికి హాని చేస్తుంది. మూత్ర సంబంధిత వ్యాధుల ముప్పు పెరుగుతుంది. సాధారణంగా పొరపాటుగా మనం పాటించే ఇలాంటి అలవాట్లు మానుకుంటే మంచిది. లేదంటే తీవ్ర ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.