సమ్మర్ లో ఈ పదార్థాలు తీసుకుంటే సమస్యలే..
_(21)-1741832608.jpeg)
సమ్మర్ లో ఏంతినాలో తెలుసు. అయితే ఏవి తినకూడదో కూడా తెలుసుకోవాలి. కొన్ని ఫుడ్స్ తింటే బద్ధకంగా, డీహైడ్రేట్ చేస్తాయి. అలాంటి ఫుడ్స్ తింటే ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి వాటిని తీసుకోకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
షుగర్ డ్రింక్స్: ఎండాకాలంలో ఎక్కువగా డ్రింక్స్ తాగుతుంటారు. కానీ షుగర్ డ్రింక్స్ అంటే సోడా, ఫ్రూట్ జ్యూసెస్, ఎనర్జీ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ వంటి డ్రింక్స్‌ని తాగకపోవడమే మంచిది. ఇందులో ఎక్కువగా షుగర్ కలుస్తుంది. దీని వల్ల డీహైడ్రేషన్ అవ్వడమే కాకుండా శక్తి తగ్గుతుంది. వీటి బదులు నీరు, హెర్బల్ టీలు, హోమ్మేడ్ ఫ్రూట్ జ్యూస్ వంటివి తాగాలి. దీని వల్ల ఎక్కువ పంచదార మీ బాడీలోకి వెళ్లదు. పైగా హైడ్రేట్‌గా ఉంటారు.
స్పైసీ ఫుడ్స్: స్పైసీ ఫుడ్స్ బాడీ టెంపరేచర్ని పెంచుతాయి. ఎక్కువగా చెమట పట్టేలా చేస్తాయి. ఇవి సమ్మర్‌కి అంత మంచివి కావు. చల్లగా, హెల్దీగా ఉండే మైల్డ్ ఆల్టర్నేటివ్స్ తీసుకోండి.
డ్రై ఫ్రూట్స్: డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకని ఎక్కువగా బాదం, అంజీర్, వాల్నట్స్, ఎండుద్రాక్ష వంటివి తింటుంటాం. అయితే, ఎండాకాలంలో వీటిని తగ్గించి తినడం మంచిది. ఎందుకంటే వీటిని తినడం వల్ల లోపలి నుంచి వేడి చేస్తుంది. కాబట్టి, తక్కువ పరిమాణంలోనే తినాలి.
ప్రాసెస్డ్ ఫుడ్స్: వేసవిలో చిప్స్, కుకీస్, క్యాండీ బార్స్ వంటి ప్రాసెస్ చేసిన ప్యాకేజ్డ్ ఫుడ్స్‌ని తగ్గించాలి. ఈ స్నాక్స్‌లో అన్‌హెల్దీ ఫ్యాట్స్, షుగర్, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఉబ్బరం, ఇతర అజీర్ణ సమస్యలకి కారణమవుతాయి. వీటి బదులు తాజా పండ్లు, నట్స్, ఎయిర్ పాప్డ్ పాప్ కార్న్ వంటి హెల్దీ ఆల్టర్నేటివ్స్ ఎంచుకోండి.
ఆయిల్ ఫుడ్స్: ఈ టైమ్‌లో ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ తినడం తగ్గించాలి. స్నాక్స్, బర్గర్స్, క్రీమీ సాసెస్ వంటివి తినొద్దు. వీటిని తినడం వల్ల మీకు చాలా బరువుగా అనిపించడమే కాకుండా లేజీగా కూడా ఉంటారు.
ఆల్కహాల్: పెరిగిన ఎండలకి ఎవరికైనా చల్లచల్లని బీర్, కాక్టెయిల్స్ తాగడం ఇష్టం ఉంటుంది. అవి అప్పటికప్పుడు హాయిగా అనిపించినా బాడీని డీహైడ్రేట్ చేస్తాయి. శరీరాన్ని ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా, హై టెంపరేచర్లో ఆల్కహాల్‌ని తగ్గించండి. రిఫ్రెష్‌గా ఉండేందుకు నీరు లేదా హైడ్రేటింగ్ డ్రింక్స్ తీసుకోండి.