షుగర్ తో పాటు చాలా జబ్బులకు ఇది సంజీవని..

Sunday, April 13, 2025 07:12 AM Lifestyle
షుగర్ తో పాటు చాలా జబ్బులకు ఇది సంజీవని..

అరటి పువ్వుల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. మెగ్నీషియం సాధారణంగా మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. అరటిపువ్వు తీసుకోవడం వలన అందులోని మెగ్నీషియం మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మానసిక ప్రశాంతతను పెంచుతుంది. దాంతో రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. అరటి పువ్వులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. ఈ కారణంగా రక్తహీనతతో బాధపడేవారు దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి.

అరటిపువ్వు శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడటంతో పాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అరటి పువ్వులోని టానిన్లు, ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి, ఆక్సీకరణ నష్టాన్ని తొలగిస్తాయి. దాంతో గుండె రోగులలో అనేక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అరటి పువ్వు నెఫ్రో ప్రొటెక్టివ్ యాక్టివిటీని కలిగి ఉంది. ఇది కిడ్నీ దెబ్బతినకుండా కాపాడుతుంది. అరటి పువ్వులలో ఉండే పీచు మూత్రపిండాల్లో రాళ్లతో పోరాడుతుంది. అరటి పువ్వులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి ప్రోస్టేట్ గ్రంధి పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులోని సిట్రిక్ యాసిడ్, అమినో యాసిడ్స్ ప్రోస్టేట్ గ్రంధిని సాధారణ పరిమాణానికి తీసుకువస్తాయి. అరటి పువ్వు అధిక రక్తపోటు సమస్యను దూరం చేస్తుంది. యాంటీ హైపర్‌టెన్సివ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇందులో ఉండే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు, అనేక పోషకాలు అనేక ఇతర వ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తాయి. అరటి పువ్వులో ఉండే జింక్ ఎముకల నష్టాన్ని నివారిస్తుంది. ఇందులో క్వెర్సెటిన్, కాటెచిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఎముకల నష్టాన్ని నివారించడంలో తోడ్పడతాయి.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: