గర్భవతి అయిన భార్య అక్క అని తెలిస్తే..
చిన్ననాటి నుండి ఇద్దరు మంచి స్నేహితులుగా ఉండేవారు. వారు పెద్దయ్యాక వారి స్నేహం ప్రేమగా మారింది. అప్పటి నుండి పార్కులకు, పబ్బులకు, సినిమాలకు వెళ్లి బాగా ఎంజాయ్ చేశారు. అలా కలిసి దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు సహజీవనం చేసి గత ఏడాదే పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే ఆమె గర్భం దాల్చినట్లు ఓ శుభవార్త విని బాగా సంతోషించారు.
అయితే ఆ జంటకు ఊహించని షాక్ ఎదురైంది. ఎనిమిదేళ్లు కలిసి జీవించిన తర్వాత వారిద్దరూ ఒకే తండ్రి పిల్లలని తెలిసింది. దీంతో వారు ఏమి చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అయితే ఈ అరుదైన సంఘటన యునైటెడ్ కింగ్ డమ్ లో జరిగింది. భర్త మాట్లాడుతూ ఈ విషయం తెలిసిన తర్వాత మేమిద్దరం చాలా బాధపడ్డాం. నాకు చాలా భయం కూడా వేసింది. నా కొడుకు ఆరోగ్యంగా పుడితే ఎలాంటి సమస్యా లేదు. అలా జరగకపోతే మా డిఎన్ఏ వివరాలు బహిర్గతం చేస్తారు. ఇంగ్లాండు చట్టం ప్రకారం ఇది నేరం
సోషల్ మీడియాలో ఈ పోస్టును చదివవి కొందరు నెటిజన్లు అతనికి వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే చట్టపరమైన సమస్యలు రాకుండా, న్యాయవాదులను సంప్రదించాలని చెబుతున్నారు. అయితే కొందరు మాత్రం అలా ఎలా కొనసాగిస్తారు, మీరు నేరం చేసినట్లే అని కామెంట్ చేస్తుండటంతో తనను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. పాపం ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు.