నేటి నుండి మృగశిర కార్తె, ఈ రోజు చేపలు ఎందుకు తింటారో తెలుసా..?

Monday, June 8, 2020 10:13 AM Lifestyle
నేటి నుండి మృగశిర కార్తె,  ఈ రోజు చేపలు ఎందుకు తింటారో తెలుసా..?

నేటి నుంచి మృగశిర కార్తె ప్రారంభం కాబోతుంది. ఈ కార్తె ప్రవేశం రోజు చేపలు తినడం అనాది నుంచి ఆనవాయితీగా వస్తున్నా, దీని వెనక ఆరోగ్య రహస్యమూ దాగి ఉంది. రోళ్లు పగిలే ఎండలను మోసుకొచ్చిన రోహిణి కార్తె ముగిసి. ముంగిళ్లు చల్లబరిచే మృగశిర మొదలవనున్నది. ఈ క్రమంలో మనిషి శరీరంలోనూ మార్పులు జరిగి, వ్యాధుల బారిన పడే ప్రమాదమున్నది.

గుండె జబ్బు, అస్తమా బాధితులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే ముప్పు ఉంది. వీటన్నింటికీ చెక్‌ పెట్టాలంటే, చేపలను తినాల్సిందే.

మృగశిర కార్తె ప్రవేశం రోజు పులుసో, ఫ్రైయ్యో చేసుకొని ఎప్పుడూ తినని వారు సైతం ఆరోగ్యం కోసం రెండు ముక్కలు నోట్లో వేసుకుంటారు. ఇక చేపలు మొత్తంగా ఇష్టం లేని వారు రొయ్యలు, ఎండ్రికాయలతో పులుసు చేసుకొని జుర్రుకుంటారు. మరికొందరైతే ఎండబెట్టిన చేపల వరుగును చింత చిగురుతో కలిపి వండుకుంటారు.

చేపలలో అనేక మాంసకృత్తులతోపాటు శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి. కాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌, కాపర్‌, మెగ్నీషియం, జింక్‌ వంటి ఖనిజ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. 

మానవునికి కావాల్సిన అతి ముఖ్యమైన, రుచిని పెంచే లైసిన్‌, మిథియోనిన్‌, ఐసొల్యూసిన్‌ వంటి అమైనో ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. చేప కొవ్వులు చాలా సులభంగా జీర్ణమై శక్తిని అందిస్తాయి. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల దాకా ఎవరైనా తినచ్చు. చేపల్లో ఉన్న కొవ్వులు మన శరీర రక్త పీడనంపై  మంచి ప్రభావం చూపుతాయి. ఓమేగా 3 కొవ్వు ఆమ్లాలలో డీహెచ్‌ఏ, ఈపీఏ వంటివి కంటి చూపునకు పనిచేస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. 

For All Tech Queries Please Click Here..!
Topics: