కీర దోసతో బోలెడు లాభాలు..
_(5)-1741658550.jpeg)
వేసవి కాలంలో కీర దోసకాయలు తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. కీర దోసలో 95 శాతం నీరు ఉంటుంది. ఇది వేసవిలో శరీరాన్ని చల్ల పరచడానికి, డీ హైడ్రేషన్ సమస్య నుంచి కాపాడడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. వేసవిలో కీరదోసను తీసుకోవడం వల్ల వడదెబ్బ బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
వేసవి కాలంలో కళ్ళు మండడం లేదా అలసిపోయినట్లుగా అనిపిస్తే కీర దోసకాయ ముక్కను 10 నుంచి 15 నిమిషాల పాటు కళ్ళపై ఉంచడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. కీర దోసను ప్రతినిత్యం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. ఇది మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. కీర దోస రసాన్ని వాడడం వల్ల చర్మం యవ్వనంగా, మృదువుగా ఉంటుంది. కీర దోస రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. కీర దోస కిడ్నీని శుభ్రపరచడంలోనూ, టాక్సిన్ లను బయటకు పంపించడంలో కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. మన కంటి ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. పునరుత్పత్తికి సహాయపడుతుంది.
కీర దోసను ప్రతినిత్యం తినడం వల్ల బరువు కూడా తగ్గుతారు. కీరా దోసకాయలో ఉండే విటమిన్ కే రక్తం గడ్డ కట్టడానికి సహాయపడుతుంది. కీర దోసకాయను గుజ్జుగా గ్రైండ్ చేసి దాని రసాన్ని తీసి నిమ్మరసం, తేనే కలిపి తీసుకుంటే మూత్రం సాఫీగా వస్తుంది.