ఉదయం ఖాళీ కడుపుతో వీటిని అస్సలు తీసుకోకండి..

ఉదయం తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఉదయం సమయంలో బ్రేక్ ఫాస్ట్ అసలు మానకూడదు. అలాగే కొన్ని ఆహారాలను పరగడుపున తీసుకోకూడదు. మనలో చాలా మందికి ఉదయం సమయంలో ఏమి తినాలో తెలియక ఏదో ఒకటి తినేస్తుంటారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానకుండా తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం తీసుకునే ఆహారంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు చాలా అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఉదయం తీసుకోకూడని ఆహార పదార్థాల గురించి తెలుసుకుందామా..
చాలా మంది ఉదయం లేవగానే స్పైసీ ఆహారాలను తీసుకుంటారు. అలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. స్పైసీ ఆహారాలు తీసుకుంటే కడుపులో మంట ఏర్పడి కడుపునొప్పి గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా బ్రెడ్ జామ్ తింటూ ఉంటారు. అలా తినడం వలన మెదడు పనితీరు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల మానసికంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
చాలా మంది ఉదయం లేవగానే పరగడుపున కాఫీ, టీ తాగుతూ ఉంటారు. పొద్దున్నే లేవగానే ఖాళీ కడుపుతో కాఫీలు, టీలు తాగడం వల్ల కాఫీలో ఉండే హైడ్రోక్లోరిక్ యాసిడ్ శరీరానికి హాని చేస్తుంది. సిట్రస్ ఫ్రూట్స్ అస్సలు తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే ఎసిడిటి, అల్సర్, గుండెల్లో మంట వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉదయం సమయంలో ఓట్స్, బాదం బొప్పాయి గుడ్లు పాలు వంటివి తీసుకోవడం మంచిది. ఇక వీటన్నిటి కన్నా కూడా చాలా మంది పల్లెల్లో చద్దన్నం, పెరుగు వేసుకొని తింటారు. అది కూడా చాలా మంచిది. ఆ రోజుల్లో వాళ్లు ఇంత ఆరోగ్యంగా ఉండటానికి అదే హెల్త్ సీక్రెట్.