బ్రేక్ ఫాస్ట్ లో ఇవి తింటే రోజంతా సూపర్ ఎనర్జీ..

Tuesday, February 11, 2025 07:06 AM Lifestyle
బ్రేక్ ఫాస్ట్ లో ఇవి తింటే రోజంతా సూపర్ ఎనర్జీ..

చాలామంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీలు, దోసెలు, పూరీలు ఇలా రకరకాల ఆహార పదార్థాలను తింటూ ఉంటారు. ఇంకా మరికొంతమంది ఉదయం అల్పాహారం చేయకుండానే ఉంటారు. అయితే బ్రేక్ ఫాస్ట్ విషయంలో ప్రతి ఒక్కరు కచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్ చేసేవారు ఉదయం ఏం తినాలి? ఏం తినకూడదు? అనేది తెలుసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్ చేయనివారు కచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ చేయాల్సిన అవసరాన్ని గుర్తించి తినాలి.

సహజంగా బ్రేక్ ఫాస్ట్ అనగానే అందరికీ ఇడ్లీ, దోస, పూరి, వడ, ఉప్మా వంటివి గుర్తొస్తాయి. పూరి, వడ వంటి నూనెతో తయారు చేసే ఆహారాలు మన ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. ఇడ్లీ దోశలు కూడా వాటిని తయారు చేయడానికి బియ్యాన్ని ఉపయోగిస్తారు కాబట్టి అవి కూడా మన ఆరోగ్యంపైన ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే ఉదయం బ్రేక్ ఫాస్ట్ విషయంలో మంచి ఆహారాన్ని తీసుకోవడానికి, పోషకాలను ఇచ్చే ఆహారాలను తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ తీసుకుంటే ఆకలి తగ్గుతుంది ఇది మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూర్చి మన కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. ఓట్స్ లో ఉండే పోషకాలు మన శరీరానికి ఎంతో దోహదం చేస్తాయి. బ్రేక్ ఫాస్ట్ లో ఊతప్పం మంచి ఆహారం. కూరగాయల ముక్కలు ఎక్కువ వేసి తయారుచేసే ఊతప్పం తింటే మంచిది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ లో రాగి, జొన్న. మిల్లెట్ దోశలు, ఇడ్లీలు తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇవి గ్లూటెన్ రహితంగా ఉంటాయి. ఐరన్ తో నిండి ఉంటాయి. ఇక ఇటువంటి పదార్థాలను తినేటప్పుడు చట్నీల విషయంలో జాగ్రత్తగా ఎంపిక చేసుకొని తినాలి. ఫ్యాట్ ఎక్కువగా ఉండే చట్నీలను తినకూడదు. ఇక ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో చిలగడ దుంపలను తీసుకుంటే మంచిది. చిలకడదుంపలలో ఫైబర్, విటమిన్ లు ఎక్కువగా ఉంటాయి.

 బ్రేక్ ఫాస్ట్ లో అవకాడో ఉండేలా చూసుకుంటే మంచిది. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి అంతేకాదు దీనిలో విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో అదనపు కొవ్వును తగ్గించడమే కాకుండా ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో బెర్రీ ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని కొవ్వును తగ్గించి శక్తిని పెంచుతాయి.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: