సమ్మర్ లో ఇవి తింటే సూపర్ ఎనర్జీ..!

వేసవిలో చాలామందికి ఎండ దెబ్బకు శరీరం డిహైడ్రేట్ అయ్యి శక్తిని కోల్పోయి నీరసంగా ఫీల్ అవుతూ ఉంటారు. అటువంటివారు వేసవిలో రోజంతా చురుకుగా ఉండడానికి శక్తినిచ్చే ఆరు రకాల సూపర్ ఫుడ్స్ ను తింటే మంచిదని ఆహార నిపుణులు చెప్తున్నారు.
అరటి పండ్లలో పొటాషియం, కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి కావలసిన అధిక శక్తిని అందిస్తాయి. వీటిని ప్రీ వర్కవుట్ ఫుడ్ గా కూడా తీసుకోవచ్చు.
గ్రీన్ టీ కూడా మనకు శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది. గ్రీన్ టీ మన శరీరంలో అలసటను తగ్గించి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. వ్యాయామం చేసేటప్పుడు శక్తి స్థాయిలను కూడా పెంపొందిస్తుంది.
పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. తక్కువ ఐరన్ స్థాయిలు కలిగి ఉన్న వారు శక్తి హీనులుగా ఉంటారు. శక్తి వంతులుగా ఉండాలంటే కచ్చితంగా ఆహారంలో పాలకూరని భాగంగా చేసుకోవడం మంచిందని నిపుణులు చెబుతున్నారు.
చియా సీడ్స్ ను నానబెట్టి తీసుకోవడం వల్ల శక్తి లభిస్తుంది. ఇందులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి కావాల్సిన ఎనర్జీని ఇచ్చి శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
డార్క్ చాక్లెట్ చిన్న ముక్కను ప్రతిరోజు తింటే మన శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్లను శరీరానికి అందిస్తుంది. అలసటను తగ్గించి శక్తిని పెంచుతుంది. దృష్టిని కూడా మెరుగుపరుస్తుంది.
ఓట్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఓట్స్ తినడం వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది. ఎండాకాలంలో అలసటతో బాధపడేవారు, శక్తి తక్కువగా ఉందని ఇబ్బంది పడేవారు ఓట్స్ తీసుకుంటే మంచిది.
గమనిక: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది మాత్రమే.