ఖాళీ కడుపుతో వీటిని అస్సలు తినకండి..
_(22)-1740102471.jpeg)
ఉదయం నిద్రలేవగానే కాఫీ లేదా టీ తాగడం చాలామందికి అలవాటు. ఒక్కరోజు ఈ కాఫీ, టీ లేకపోతే ఆ రోజంతా ఏదోలా ఉంటుందని చెప్తుంటారు. పరగడపున తాగే టీ, కాఫీల వలన హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడి తీవ్రమైన ఒత్తిడికి గురవుచేస్తాయి. కాఫీ, టీలే కాదు పరగడుపున ఇంకొన్ని ఆహారపదార్థాలు తీసుకుంటే కూడా శరీరానికి హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
టమోటాలు తింటే వాటిలో ఉండే యాసిడ్స్ ఖాళీ కడుపులో చేరి వికారం కలిగించడమే కాకుండా ప్రేగుల్లో మంట పుట్టిస్తుంది. పరగడపున అరటిపండ్లు తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే మెగ్నీషియం స్థాయి అధికమవుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఉదయాన్నే స్పైసీ ఫుడ్స్ తీసుకుంటే అల్సర్ వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఉదయం లేవగానే సోడా, కూల్‌డ్రింక్స్‌ను తాగడం వల్ల ప్రేగుల్లో మంట కలిగి వాంతులు, వికారం వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదముంది.