కీళ్ల నొప్పులతో బాధపడేవారు తినకూడని పదార్థాలు

కీళ్ల నొప్పులతో బాధపడేవారు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. కీళ్ల నొప్పుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే నొప్పులు అధికం అవుతాయి. కొన్ని రకాల ఆహారాలు కీళ్ల నొప్పులను మరింత పెంచుతాయి. అటువంటి ఆహారాలను తీసుకోకుండా ఉంటేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
కీళ్ల నొప్పులతో బాధపడేవారు దుంప కూరలు తినకూడదు. ఆలుగడ్డ, చేమ గడ్డ, కంద గడ్డ వంటి వాటిని తినకుండా ఉంటేనే మేలు. దుంప కూరలతో కీళ్ల నొప్పులు మరింత పెరుగుతాయి. ఇక కీళ్లనొప్పులతో బాధపడేవారు ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను కూడా తీసుకోకూడదు. ఉప్పు ఎక్కువగా తింటే కీళ్ల నొప్పి తీవ్రతరమవుతుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు తీపి పదార్థాలను కూడా ఎక్కువగా తీసుకోకూడదు. ఎక్కువ తీపి పదార్థాలను తింటే కీళ్ల నొప్పులు అధికం అవుతాయి. వీటివల్ల కణాలకు, కీళ్లకు ఇబ్బంది ఏర్పడుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, బేకరీ ఫుడ్స్, సోడాలు, ఐస్క్రీమ్లు వంటివి కీళ్లనొప్పులు ఉన్నవారు తీసుకోకుండా ఉంటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు కీళ్ల నొప్పులతో బాధపడేవారు శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉన్న ప్రాసెస్ చేసిన ఆహారాలను, రెడీ టు ఈట్ ఆహారాలను అసలు తినకూడదు. అధికంగా ఆల్కహాల్ తాగడం వల్ల శరీరంలో ఉండే నీరు, పోషకాలు తగ్గిపోతాయి ఇది కీళ్లనొప్పిని మరింత పెంచుతుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు రెడ్ మీట్ ను ఎక్కువగా తినకూడదు. రెడ్ మీట్ లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. రెడ్ మీట్ ను తినకుండా ఉంటేనే మంచిది.