భోజనంతో పాటు తీసుకోకూడని ఆహార పదార్థాలు..

Saturday, April 5, 2025 07:10 AM Lifestyle
భోజనంతో పాటు తీసుకోకూడని ఆహార పదార్థాలు..

మధ్యాహ్న భోజనం శరీరానికి శక్తిని అందించడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరిచే ప్రధాన సమయం. కొన్ని ఆహారాలను ఈ సమయంలో తింటే బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియ మందగించడానికి, శరీరానికి అనవసరమైన కొవ్వు చేరడానికి కారణమవుతుంది. సో మధ్యాహ్న భోజనంలో కొన్ని ఆహారాలను తీసుకోకపోవడం చాలా మంచిది..

వైట్ బ్రెడ్ సాండ్విచ్‌ను మధ్యాహ్న భోజనంలో తినకూడదు. దీనిలో అధికంగా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయి పెంచి కొంతసేపటి తర్వాత తిరిగి ఆకలిని పెంచుతాయి. దాంతో ఎక్కువ తినడం వల్ల బరువు పెరుగుతారు. ముఖ్యంగా అధిక క్రీమ్ కలిగిన పాస్తా మధ్యాహ్నం తినకూడదు. ఇది అధిక క్యాలరీలు, కొవ్వును కలిగి ఉంటుంది. దీంతో జీర్ణక్రియ మందగించి అలసట వస్తుంది. లంచ్‌లో తేలికపాటి ఆహారం తీసుకుంటే శరీరం ఉల్లాసంగా ఉంటుంది.

షుగర్ ఎక్కువగా ఉండే సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్‌ను మధ్యాహ్నం తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరుగుతాయి. దీని ప్రభావం బరువుపై పడటమే కాకుండా డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. బర్గర్, ఫ్రైస్, పిజ్జా లాంటి ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇవి అధికంగా కొవ్వు, ఉప్పు కలిగి ఉంటాయి. శరీరంలో నీరు నిల్వ ఉండేలా చేసి కడుపు పగిలినట్టుగా అనిపించేలా చేస్తాయి. అదే సమయంలో కొవ్వు పేరుకుని బరువు పెరగడానికి కారణమవుతాయి. చీజ్ ఎక్కువగా ఉండే ఆహారాలను మధ్యాహ్నం తినడం మంచిది కాదు. చీజ్‌లో అధిక కొవ్వు ఉండటం వల్ల జీర్ణక్రియ మందగించి బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ లేదా ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకుంటే కొవ్వు నిల్వ ఉండి గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

ప్రాసెస్ చేసిన మాంసం కూడా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇవి ఎక్కువగా ప్రిజర్వేటివ్స్, ఉప్పు కలిగి ఉంటాయి. దీని వల్ల రక్తపోటు పెరగడం, గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మధ్యాహ్న భోజనం శరీరానికి శక్తిని అందించాలి కానీ బరువు పెరగడానికి కారణం కాకూడదు. అందుకే తేలికపాటి పోషకమైన ఆహారం తీసుకోవడం ఉత్తమం. ఆరోగ్యంగా ఉండాలంటే తినే తిండి విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: