పడుకునే ముందు ఈ నీటిని తాగితే ఏం జరుగుతుందో తెలుసా..?

Wednesday, February 26, 2025 05:59 AM Lifestyle
పడుకునే ముందు ఈ నీటిని తాగితే ఏం జరుగుతుందో తెలుసా..?

లవంగాలు ఆహార రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. రోజూ లవంగం నీటిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా రాత్రిళ్లు పడుకునే ముందు లవంగం నీటిని తాగడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఆరు ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ లవంగాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యంగా లవంగం నీటిని తాగడం వల్ల చిన్న పిల్లలలో సాధారణంగా కనిపించే కడుపు నొప్పి, రాత్రిపూట గ్యాస్ వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. జీర్ణక్రియ ప్రక్రియలో సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తి బలహీనపడిన వారిలో రోగనిరోధక శక్తిని పెంచడానికి రోజూ లవంగం నీటిని తాగవచ్చు. లవంగాలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని హానికరమైన సూక్ష్మజీవులను నిరోధించే సామర్థ్యాన్ని పెంచుతాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) ప్రకారం.. లవంగాలలో యూజినాల్ ఉంటుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. పడుకునే ముందు లవంగం నీరు తాగడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. మంచి నిద్ర వస్తుంది. ఈ నీటిని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే మరింత ప్రయోజనం ఉంటుంది. లవంగాలలోని యూజీనాల్ యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది నోటిలో హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది. పడుకునే ముందు దీన్ని తీసుకోవడం వల్ల నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. చెడు వాసనను నివారించవచ్చు. లవంగం నీరు తాగడం వల్ల కాలేయం నిర్విషీకరణ అవుతుంది. యూజినాల్ కాలేయాన్ని వివిధ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. అలాగే ఇది వాపు, ఆక్సీకరణ ఒత్తిడి వంటి మొదలైన కాలేయ రుగ్మతలను తగ్గించడంలో సహాయపడుతుంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: