ఈ ధాన్యాలు తింటే ఏమవుతుందో తెలుసా..

ఆహారం అనగానే సాధారణంగా పండ్లు, కూరగాయలు, ఆకు కూరలే గుర్తొస్తాయి. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్న ఆహారం చిరు ధాన్యాలు. ఇటీవల కాలంలో జనాలకు వీటిపైన చాలా అవగాహన పెరిగింది. చాలా చోట్ల చిరుదాన్యాలతో తయారు చేసిన ఆహార ఉత్పత్తులు దొరుకుతున్నాయి. చిరు ధాన్యాల టిఫిన్ సెంటర్లు కూడా వెలుస్తున్నాయి. ఇక చిరు ధాన్యాలతో పిండి వంటలు కూడా తయారు చేస్తున్నారు.
చిరు ధాన్యాలలో కొర్రలు, రాగులు, సజ్జలు, జొన్నలు, అండ్రు కొర్రలు ఇలా చాలా ఉన్నాయి. ఈ చిరు ధాన్యాలన్నీ వేటికవే ప్రత్యేకం. చిరు ధాన్యాలను ఆహారంగా తీసుకోవాలని భావించే వారు వీటిని ఒక టైం టేబుల్ ప్రకారం ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చిరు ధాన్యాలలో మన శరీరానికి కావలసిన బోలెడు మిటమిన్లు, పోషకాలు ఉంటాయి. చిరు ధాన్యాలు ముఖ్యంగా మన శరీరానికి కావాల్సిన పోషకాలను ఇవ్వటంతో పాటు మన శరీర బరువును తగ్గించటానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాంటి ఆరోగ్యానిచ్చే వాటిలో రాగులు ఒకటి . ఇవి ఎముకలను బలంగా మారుస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, అనీమియాను నివారిస్తాయి.