ఇలా చేస్తే నిండు నూరేళ్ళు జీవిస్తారు..!

Saturday, February 22, 2025 07:10 AM Lifestyle
ఇలా చేస్తే నిండు నూరేళ్ళు జీవిస్తారు..!

దీర్ఘాయువుగా, ఆరోగ్యంగా జీవించాలనేది దాదాపు అందరి కోరిక. నేటి ఆధునిక జీవనశైలి, వైద్యం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పొందలేము. మన జీవిత రహస్యం మన చేతుల్లోనే ఉన్నట్లుగా, మనం తీసుకునే ఆహారం, ఆరోగ్యం, ఒత్తిడి నిర్వహణ, ఆనందం వంటి వాటిపై శ్రద్ధ వహించాలి. ఆరోగ్యమే మహా భాగ్యం అనే సామెత ప్రకారం ఆరోగ్యకర అంశాలు దీర్ఘాయువుకు ముఖ్యమైన ఆధారం. ఇటీవలి ఓ సర్వే ఆసక్తికర అంశాలను వెల్లడించింది.

నూరేళ్లకు మించి ఆరోగ్యంగా జీవిస్తున్న వృద్ధులు తమ ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అంటే 57శాతం నుంచి 65శాతం వరకు మితమైన కొవ్వు, ప్రోటీన్ వంటివి తీసుకున్నారు. కూరగాయలు, పండ్లు, లీన్ ప్రొటీన్లు, చేపలు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు తరచుగా వారి ఆహారంలో అలవాటుగా చేసుకున్నారు. అంతేకాదు వారు ఆహారంలో ఉప్పు తక్కువగా తీసుకుంటారు. అంతేకాదు ఇతరులతో పోలిస్తే వందేళ్లు దాటిన వారిలో వ్యాధుల ప్రభావం తక్కువగా ఉంటుంది. దీంతో మందుల వాడకం కూడా తక్కువ. ఇది మెరుగైన ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.

మంచి నిద్ర కూడా దీర్ఘాయువుకు తోడ్పడుతుంది. 68శాతం శతాబ్ధి వయస్సు గలవారు సంతృప్తికర నిద్రను పొందుతారు. 7 నుండి 8 గంటల మంచి నిద్ర దీర్ఘాయువు రహస్యం. అందుకే మంచి నిద్ర ఆరోగ్యానికి చాలా ముఖ్యం అనేది ఇప్పటికీ వైద్య నిపుణులు చెబుతున్న మాట. ఇక, వీరిలో దాదాపు 75శాతం మంది నూరేళ్లకు పైబడిన వారు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరిలో తక్కువ ఒత్తిడి, దీర్ఘకాలిక వ్యాధులకు అవకాశం లేదని తేలింది. ఇలాంటి ముఖ్యమైన పద్ధతులు ప్రతి ఒక్కరికీ దీర్ఘాయువును ప్రసాదించలేకపోయినప్పటికీ ఇలాంటి అలవాట్లు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, దీర్ఘాయువు అవకాశాలను పెంచడంలో దోహదపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: