కృత్రిమ వీర్యంతో నచ్చిన రూపంలో పిల్లలు.. మగాడి అవసరమే లేదు

Tuesday, January 28, 2025 11:30 AM Lifestyle
కృత్రిమ వీర్యంతో నచ్చిన రూపంలో పిల్లలు.. మగాడి అవసరమే లేదు

ఆడ, మగ శృంగారం చేసుకోకుండానే బిడ్డను కనే రోజులు త్వరలో రాబోతున్నాయి. స్వలింగ జంటలు కూడా సంతాన భాగ్యాన్ని పొందేందుకు అవకాశం ఏర్పడనుంది. మానవ వీర్యాన్ని, అండాలను ప్రయోగశాలలో వృద్ధి చేసే ప్రక్రియకు శాస్త్రవేత్తలు ఇప్పటికే దగ్గరలో ఉన్నట్లు మానవ ఫలదీకరణ, పిండోత్పత్తి శాస్త్ర(హెచ్‌ఎఫ్‌ఈఏ) బోర్డు గత వారం నిర్వహించిన సమావేశంలో ప్రకటించింది.

మానవ ఫలదీకరణ, పిండ శాస్ర్తానికి సంబంధించిన చట్టాన్ని ఆధునీకరించేందుకు 2023లో కొన్ని ప్రతిపాదనలు చేసిన హెచ్‌ఎఫ్‌ఈఏ ల్యాబ్‌లో మానవ వీర్యాన్ని, అండాలను వృద్ధి చేయడాన్ని వైజ్ఞానిక రంగం సాధించిన విప్లవాత్మక పురోగతిగా పేర్కొంది. నైతికంగా ఇది ఎంతో వివాదాస్పదమైన పురోగతే అయినప్పటికీ దీన్ని వినియోగించుకోవడం వల్ల ఎన్నో లాభాలతోపాటు నష్టాలు కూడా ఉన్నట్టు తెలిపింది. ల్యాబ్‌లో పెంచిన అండాలు, వీర్యం సాయంతో తల్లిదండ్రులు తమ భవిష్యత్తు సంతానాన్ని నచ్చినట్టుగా అభిరుచికి తగిన మార్పులు చేసుకోవచ్చని తెలిపింది. శాస్త్రవేత్తలు ఇప్పటికే ఈ పద్ధతిలో ఎలుకల నుంచి కొన్ని పిల్లలను, జీవ సంబంధీకులైన ఇద్దరు తండ్రుల నుంచి ఓ బిడ్డను ఉత్పత్తి చేశారని హెచ్‌ఎఫ్‌ఈఏ వెల్లడించింది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: