పొరపాటున కూడా ఈ 4 ఆహారాలు తినకండి...

మూత్రపిండాల్లో రాళ్లతో బాధపడేవారు మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి, తరచుగా టాయిలెట్‌కు వెళ్లడం, కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం, నడుము ప్రాంతంలో నొప్పి వికారం వంటి వాటితో బాధపడుతుంటారు. అలాంటి వారు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటం ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
1.కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. దీని కారణంగా రాళ్ళు పెరుగుతాయి. నిమ్మ, పాలకూర, నారింజ, ఆవాలు, కివి, జామ వంటి వాటిని తినడం మానేయడం మంచిది.
2.మూత్రపిండాల్లో రాళ్లతో బాధపడేవారు తరచుగా డీహైడ్రేషన్ సమస్యను ఎదుర్కొంటారు. అలాంటి సందర్భంలో కెఫిన్ శరీరానికి హానికరం. అందువల్ల శీతల పానీయాలు, టీ-కాఫీలు కిడ్నీల్లో రాళ్లు ఉన్న రోగులకు విషం కంటే ప్రమాదమని నిపుణులు పేర్కొంటున్నారు.
3.మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు ఉప్పు, అత్యధిక ఉప్పు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి. వాటిలో అధిక మొత్తంలో సోడియం ఉంటుంది. ఇది మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
4.మాంసం, చేపలు, గుడ్లు కూడా కిడ్నీలో రాళ్లు ఉన్న రోగులకు అస్సలు మంచిది కాదు. వాటిలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఈ పోషకం శరీరానికి ఎంత ముఖ్యమైనదైనా, అది మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. మూత్రపిండాల్లో రాళ్లు సమస్యతో బాధపడుతున్న వారు ఎప్పటికప్పుడు వైద్య నిపుణులను సంప్రదించి. పరీక్షలు చేయించుకోవడం, వైద్యం పొందడం ముఖ్యం. అలానే వైద్యులు చెప్పిన విధంగా ఆహారాలను తీసుకోవాలి.