వీరు పొరపాటున కూడా వంకాయను తినకండి..

ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలలో వంకాయ కూడా ఒకటి. ఇది అనేక పోషకాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కానీ కొన్ని ఆహార పదార్థాలతో కలిపి వంకాయ తినడం, కొన్ని ఆరోగ్య సమస్యలు కలిగిన వారు తినడం వల్ల అవి మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. వీటి వల్ల శరీరానికి హాని కలుగుతుందని నిపుణులు అంటున్నారు.
కొన్ని అధ్యయనాల్లో వంకాయలు పాలు తక్కువ టైమ్ గ్యాప్ లో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని తేలింది. పాలు వంకాయలు కలిపి జీర్ణం కావడం కష్టం. దీని వల్ల మలబద్ధకం, కడుపు నొప్పి ఇతర జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా వంకాయలు ఉన్న ఆహారం తిన్న తర్వాత పాలు తాగడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. కొన్ని అసాధారణ లక్షణాలు కనిపిస్తాయి.
వంకాయ వేడి స్వభావం కలిగి ఉంటుంది. అయితే పెరుగు చలువ చేస్తుంది. ఈ రెండు వ్యతిరేక లక్షణాలను కలిపి తినడం వల్ల కూడా జీర్ణ సమస్యలు వస్తాయి. చాలా మందికి భోజనం తర్వాత టీ తాగే అలవాటు ఉంటుంది. కానీ వంకాయ తిన్న వెంటనే టీ తాగడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించే సామర్థ్యం తగ్గుతుంది. టీ అనేది టానిన్ అధికంగా ఉండే పానీయం, ఇది వంకాయలో ఉండే ఐరన్ ను సరిగా గ్రహించకుండా నిరోధిస్తుంది. దీనివల్ల రక్తహీనత సమస్య వస్తుంది.
రెడ్ మీట్ జీర్ణమయ్యే ప్రక్రియ చాలా సమయం పడుతుంది. వంకాయలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల కడుపులో అజీర్ణం ఏర్పడుతుంది. ఇది కడుపులో ఉబ్బరం, గ్యాస్ సమస్యలకు కారణమవుతుంది.
రక్తహీనతతో బాధపడేవారికి, వంకాయ శరీరంలో ఐరన్ శోషణను తగ్గిస్తుంది. అలెర్జీ సమస్య ఉంటే వంకాయ కొంతమందికి చర్మ సమస్యలు, దద్దుర్లు, శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుంది. వంకాయలో ఉండే కొన్ని పదార్థాలు కిడ్నీలో రాళ్ల సమస్యను మరింత పెంచుతాయి. కళ్ళలో మంటతో బాధపడుతున్న వ్యక్తులు కూడా దీనికి దూరంగా ఉండాలి. మీ కళ్ళలో ఏదైనా సమస్య ఉంటే చికాకు లేదా వాపు ఉంటే, వంకాయ తినకండి. మీరు మూలవ్యాధితో బాధపడుతుంటే వంకాయ తినకండి. అది మీ సమస్యను పెంచుతుంది.