డయాబెటిస్ రాకుండా ఉండాలంటే.. ఇలా చేయండి..

Saturday, February 15, 2025 07:22 AM Lifestyle
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే.. ఇలా చేయండి..

ప్రస్తుత కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా లక్షలాది మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. శరీరంలో ఇన్సులిన్ తగినంత పరిమాణంలో ఉత్పత్తి కానప్పుడు, గ్లూకోజ్ రక్తంలో చేరడం ప్రారంభమవుతుంది. ఇది డయాబెటిస్‌కు కారణమవుతుంది. డయాబెటిస్ వచ్చే ముందు, ఒక వ్యక్తి ప్రీ డయాబెటిస్ దశలో ఉంటాడు.. రక్తంలో చక్కెర స్థాయి 100 నుంచి 125 mg/dL మధ్య ఉంటే, ఆ వ్యక్తి ప్రీ-డయాబెటిక్ అని అర్థం. అటువంటి పరిస్థితిలో, మీ జీవనశైలిలో, ఆహారంలో అవసరమైన మార్పులు చేసుకోవడం ద్వారా.. అది డయాబెటిస్‌గా మారకుండా నిరోధించవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.

మీ ఆహారం, జీవనశైలిని మార్చుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చు. ప్రీ-డయాబెటిస్ గురించి తెలుసుకున్న తర్వాత, మీ ఆహారాన్ని మార్చుకోవాలి. ఇలాంటి సమయంలో మరిన్ని పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు తినండి. ఇది మీ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. మీ ఆహారం నుంచి ప్రాసెస్ చేసిన చక్కెర, కార్బోహైడ్రేట్లను తొలగించాలి.

ప్రీ డయాబెటిస్ సమయంలో మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. నడక, పరుగు, సైక్లింగ్ లేదా ఈత వంటి వ్యాయామం చేయడం వల్ల మీ శరీరం ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. అధిక బరువు పెరగడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. కాబట్టి మీ బరువును నియంత్రించుకోండి. ఇది కాకుండా, మీ ఒత్తిడిని తగ్గించుకోండి. రోజూ యోగా, ధ్యానం చేయండి. ఇది మీ శరీరంలో ఒత్తిడి హార్మోన్ల స్థాయిని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మీ రక్తంలో షుగర్ ను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. దీనితో మీరు డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మీ వైద్యునితో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరపడం, వారు ఇచ్చిన సలహాలను పాటించడం కూడా ముఖ్యమని నిపుణులు అంటున్నారు.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: