పాలు తాగే ముందు ఈ తప్పులు చేస్తున్నారా..? అయితే డేంజరే..!
_(9)-1743644070.jpeg)
పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వాటిలో ఒకటి. వీటిలో కాల్షియం అధికంగా ఉండటంతో ఎముకలకు బలాన్ని అందిస్తాయి. పిల్లల ఎదుగుదలలోనూ పాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం కొన్ని ఆహారాలను పాలు తాగిన వెంటనే తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.
పాలు తాగే ముందు లేదా తాగిన తర్వాత కొంత సమయం గడిపి మాత్రమే ఆమ్లతత్వం (ఎసిటిక్ నేచర్) ఉన్న ఆహారాలను తీసుకోవడం మంచిది. చిప్స్, ఉప్పు కలిపిన గింజలు, ప్రాసెస్డ్ ఫుడ్స్ వంటి ఉప్పు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తిన్న వెంటనే పాలు తాగడం ఆరోగ్యానికి చాలా హానికరం. ఉప్పు అధికంగా ఉన్న ఆహారం శరీరంలోని సోడియం స్థాయిని పెంచుతుంది. వెంటనే పాలు తాగితే సోడియం సమతుల్యత దెబ్బతిని రక్తపోటు ఉన్నవారికి మరింత ప్రమాదం ఏర్పడుతుంది. ఒక అధ్యయనంలో అధిక ఉప్పు తీసుకున్న తర్వాత పాలు తాగితే జీర్ణక్రియ మందగిస్తుందని గుర్తించారు. పాలలోని కాల్షియం, ఐరన్‌ను అడ్డుకోవడంతో రక్తహీనత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, పిల్లలు, అనేమియా ఉన్నవారు ఈ విషయంలో మరింత జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.