ఈ ఐదు జ్యూసులు తాగితే.. ఒంట్లో వేడి పరార్..!
-1742262750.jpg)
వేసవి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. ఎండల కారణంగా చెమట ఎక్కువగా వస్తుంది. దీంతో శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా అవసరం. లేకపోతే, డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. నీరసం, వడదెబ్బ వంటి సమస్యలు కూడా వస్తాయి. శరీరం జీర్ణ సమస్యలను కలిగిస్తే దద్దుర్లు, మొటిమలు, తలనొప్పి, అధిక రక్తపోటు, తలతిరగడం, హృదయ స్పందన రేటు పెరగడం వంటివి కూడా తలెత్తుతాయి. ఎండ నుండి తప్పించుకోవడానికి వేసవిలో కొన్ని పానీయాలు తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
వేసవిలో మీకు తల తిరుగుతుంటే నిమ్మరసం తాగడం మీ ఆరోగ్యానికి చాలా మంచిది. నిమ్మరసం తయారుచేసేటప్పుడు దానికి కొంచెం ఉప్పు కలపాలి. ఉప్పు శక్తిని ఇస్తుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి పోషకాలు శరీరాన్ని చల్లగా ఉంచడానికి సహాయపడతాయి. మీకు కావాలంటే, నిమ్మకాయకు అల్లం, పుదీనా కూడా జోడించవచ్చు.
బొప్పాయి రసం తాగడం వల్ల వేసవిలో శరీరం చల్లగా ఉంటుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటితో పాటు తులసి రసం శీతాకాలంలోనే కాదు వేసవిలో కూడా మంచిది. ఇది జలుబు సమస్యలను కూడా దూరం చేస్తుంది. చెరకు రసం ఎండ నుండి కూడా రక్షిస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. దీంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వేసవిలో పండ్ల రసాలు తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా తక్షణ శక్తి కూడా లభిస్తుంది. వీటిలో అధిక నీటి శాతం ఉంటుంది. అవి శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. అవి వేడిని తగ్గించడానికి కూడా సహాయ పడతాయి.