పుచ్చకాయతో వీటిని కలిపి తింటే ప్రమాదమే..

Wednesday, March 19, 2025 07:26 AM Lifestyle
పుచ్చకాయతో వీటిని కలిపి తింటే ప్రమాదమే..

వేసవిలో అందరూ పుచ్చకాయను ఎక్కువగా తింటారు. పుచ్చకాయ దాదాపు 90 శాతం నీటితో నిండి ఉంటుంది. ఇది వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. అయితే, పుచ్చకాయ తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పుచ్చకాయతో పాటు కొన్ని ఫుడ్స్ కలిపి తినకూడదు. అంతేకాకుండా పుచ్చకాయ తిన్న వెంటనే వీటిని తినకూడదు. పుచ్చకాయతో కలిపి తింటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. 

పుచ్చకాయ తిన్న తర్వాత పొరపాటున కూడా పాలు తాగకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పుచ్చకాయలో విటమిన్ సి ఉంటుంది. అది పాల ఉత్పత్తులతో చర్య జరిపి ఉబ్బరానికి కారణమవుతుంది. అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యల్ని కలిగిస్తాయి. పుచ్చకాయతో కలిపి లేదా తిన్న తర్వాత పాల జోలికి పోకండి.

పుచ్చకాయ తినేటప్పుడు అధిక ప్రోటీన్ ఆహారాలకు దూరంగా ఉండాలి. పుచ్చకాయలో విటమిన్లు, పోషకాలతో పాటు కొద్ది మొత్తంలో స్టార్చ్ కూడా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల జీర్ణవ్యవస్థకు హాని కలుగుతుంది. అందుకే పుచ్చకాయతో కలిపి అధిక ప్రోటీన్ ఉండే ఆహారాల్ని తినడం మానేయండి.

గుడ్డు, పుచ్చకాయ రెండూ వేర్వేరు ప్రభావాలను కలిగి ఉంటాయి. అందుకే ఈ రెండింటిని కలిపి తినకూడదు. అలా కలిపి తింటే ఉబ్బరం, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. ఈ రెండూ ఒకదానికొకటి జీర్ణం కాకుండా నిరోధిస్తాయి.

పుచ్చకాయ తిన్న తర్వాత లేదా దాని రుచిని పెంచడానికి ఉప్పుతో కలిపి తింటే అది మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఇలా చేయడం వల్ల, పుచ్చకాయలోని పోషకాలు శరీరంలోకి శోషించబడవు. దీంతో రక్తపోటు(బీపీ) అదుపు తప్పే ప్రమాదముంది. బిపీలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: