చుండ్రు సమస్య ఇబ్బంది పెడుతోందా?.. ఇలా చేస్తే చాలు మటుమాయం..

చుండ్రు సమస్య చాలా మందిని వేధిస్తుంది. ఇది జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీసి, జుట్టు రాలే ప్రమాదాన్ని పెంచుతుంది. చుండ్రును తగ్గించేందుకు ఇంట్లోనే అందుబాటులో ఉండే కొన్ని సహజ చిట్కాలను పాటించడం చాలా మంచిది. కొబ్బరి నూనె, నిమ్మరసం, యాపిల్ సైడర్ వెనిగర్, అలోవెరా గుజ్జు, ఉసిరి పొడి, ఉల్లిపాయ రసం, ఎగ్ మాస్క్, టీ ట్రీ ఆయిల్, బేకింగ్ సోడా వంటివి చుండ్రును తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి తల చర్మాన్ని పోషించి, కొత్త జుట్టు ఎదిగేలా చేయడంతో పాటు చుండ్రు మళ్లీ రాకుండా నియంత్రిస్తాయి.
నిమ్మరసం, కొబ్బరినూనె స్కాల్ప్ ను మాయిశ్చరైజ్ చేస్తుంది. నిమ్మరసంలోని యాంటీ ఫంగల్ గుణాలు డాండ్రఫ్ తో పోరాడతాయి. ఈ రెండిటీని కలిపి రాసుకొని 30 నిమిషాల తర్వాత స్నానం చేస్తే చుండ్రు తొలగుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. నీటిలో యాపిల్సైడర్ వెనిగర్ కలిపి రాసుకుంటే చుండ్రు పోతుంది. అలోవెరా జెల్ రాసుకుంటే కూడా చుండ్రు మాయం అవుతుంది.
ఉల్లిరసంలో సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఉల్లిరసం అప్లై చేయడం వల్ల చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. ఉసిరిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఉసిరి పొడిని స్కాల్ప్ కు అప్లై చేయడం వల్ల చుండ్రు తగ్గుతుంది. టీ ట్రీ ఆయిల్లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి చుండ్రు సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి. కొబ్బరినూనెలో టీ ట్రీ ఆయిల్ కలిపి రాసుకుంటే మంచిది. చుండ్రు సమస్యను తగ్గించడంలో బేకింగ్ సోడా సహాయపడుతుంది.