వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కర్భూజ తినకూడదు..
_(23)-1743903340.jpeg)
ఎండలు దంచి కొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఎండల్ని తప్పించుకునేందుకు ప్రజలు తిండి నుంచి జీవనశైలి వరకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వేసవి కాలంలో పుచ్చకాయ, కర్భూజ కాయలు ఎక్కువగా దొరుకతాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. కర్భూజ కాయ టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. వేసవికాలంలో ఈ పండు దాహార్తిని కూడా తీరుస్తుంది. కర్భూజలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి., ఇందులో విటమిన్ ఇ, జింక్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, భాస్వరం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. కర్భూజలో చాలా ఫైబర్ ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ కొందరు మాత్రం ఈ పండు తినకూడదు. కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కర్భూజ పండుకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
డయాబెటిస్‌తో బాధపడేవారు కర్భూజ కాయను తినకూడదని నిపుణులు తెలిపారు. కర్భూజకాయను ఎక్కువ మొత్తంలో తినడం వల్ల షుగర్ లెవల్స్ పెరుగుతాయి. నిజానికి కర్భూజ కాయ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ 60 నుంచి 80 మధ్య ఉంటుంది.
చర్మ సంబంధిత, శ్వాసకోస అలర్జీలతో బాధపడుతున్న వారు కర్భూజను తినకపోవడమే మేలని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వారు వైద్యుణ్ని సంప్రదించి తినడం బెస్ట్ అంటున్నారు. వైద్యుల సలహా లేకుండా చర్మ సంబంధిత అలర్జీలతో బాధపడేవారు తినకూడదు. తింటే చర్మంపై దద్దుర్లు, దురద, వాపు లేదా ఇతర అలెర్జీ సమస్యలు రావచ్చంటున్నారు.
గ్యాస్ట్రిక్ లేదా ఇరిటబుల్ ఒవల్ సిండ్రోల్ (IBS) ఉన్నవారు కర్భూజ పండు తినకుండా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కర్భూజ పండు తినడం వల్ల గ్యాస్, ఉబ్బరం లేదా కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తవచ్చు. కర్భూజ పండును ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ఫైబర్ పెరుగుతుంది. ఇది మలబద్ధానికి కూడా దారి తీయవచ్చు.
కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కూడా కర్భూజ పండును తినకపోవడమే మేలని నిపుణులు చెబుతున్నారు. కర్భూజ పండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీనిని మూత్రపిండాలు ఫిల్టర్ చేయకపోవచ్చు. దీంతో, కిడ్నీలపై ఒత్తిడి ఎక్కువ పడుతుంది. మీ కిడ్నీ సంబంధిత సమస్యలు మరింత తీవ్రంగా మారవచ్చంటున్నారు నిపుణులు.