మెదడును షార్ప్ గా ఉంచే సూపర్ ట్రిక్స్..

Friday, April 4, 2025 07:38 AM Lifestyle
మెదడును షార్ప్ గా ఉంచే సూపర్ ట్రిక్స్..

రోజువారీ జీవనశైలి, ఆహారం, ఒత్తిడి, శారీరక శ్రమలతో మానసిక సామర్థ్యం ప్రభావితమవుతుంది. కొన్నిసార్లు మతిమరపు సమస్యలు, సాధారణంగా గందరగోళం, గుర్తు పట్టలేకపోవడం, పని మరిచిపోవడం అనేవి సాధారణమే. కానీ దీర్ఘకాలికంగా జ్ఞాపకశక్తి మందగిస్తే, అది ఆందోళనకరమైన విషయం. సరైన ఆహారం, వ్యాయామం, మానసిక శ్రమ, జీవనశైలి మార్పులు ద్వారా మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

మెదడుకు అవసరమైన పోషకాలు అందకపోతే జ్ఞాపకశక్తి మందగించే అవకాశం ఉంటుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలను తీసుకోవాలి. ముఖ్యంగా చేపలు, అవిసె గింజలు, వాల్‌నట్స్ తినడం మెదడుకు మేలు చేస్తాయి. యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే బెర్రీ పండ్లు, గ్రీన్ టీ, క్యారెట్, బీట్‌రూట్ లాంటి ఆహారాలు మెదడును ఉత్తేజితం చేస్తాయి. పెరుగును తినడం వల్ల దానిలోని ప్రొబయాటిక్స్ ఉండటం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. డార్క్ చాక్లెట్ కూడా జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. ఇది మెదడుకు కావాల్సిన యాంటీఆక్సిడెంట్లు అందిస్తుంది. సపోటా, యాపిల్, అవకాడో, స్పినచ్ వంటి ఆహార పదార్థాలు కూడా మెదడును శక్తివంతంగా ఉంచుతాయి. శారీరక శ్రమ లేకపోతే మెదడు నెమ్మదిస్తుంది. కాబట్టి వ్యాయామాన్ని చాలా ముఖ్యం. నడక, జాగింగ్, యోగా వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి మెదడుకు ఆక్సిజన్‌ అందుతుంది. ధ్యానం, ప్రాణాయామం చేస్తే ఒత్తిడిని తగ్గించడంతో పాటు మెదడును ప్రశాంతంగా ఉంచుతాయి. 

క్రాస్‌వర్డ్స్, పజిల్స్, సుడోకు వంటి అలవాట్లు మెదడు చురుకుగా ఉండటానికి తోడ్పడతాయి. పుస్తకాలు చదవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చిత్రలేఖనం, సంగీతం, క్రియేటివ్ ఆర్ట్స్ మీ మెదడు ఉత్తేజితంగా ఉండేందుకు సహాయపడతాయి. ఒత్తిడిని నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. రోజుకు 7-8 గంటలు నిద్రపోవడం ద్వారా మెదడు విశ్రాంతి తీసుకుంటుంది. అధిక బరువు మెదడు పనితీరును దెబ్బతీస్తుంది. పాజిటివ్‌గా ఉండడం అలవాటు చేసుకోండి. ఇది సంతోషంగా ఉండే వ్యక్తుల మెదడు చురుకుగా పనిచేస్తుంది.

బాదం, గుడ్డు తీసుకోండి. రోజూ 5-6 బాదం తినడం మెదడు చురుకుగా ఉండేందుకు సహాయపడుతుంది. అదే విధంగా మెంతులు, జీలకర్ర నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. ఇవి మెదడుకు అవసరమైన పోషకాలను అందిస్తాయి. తులసి, అశ్వగంధ, బ్రాహ్మి వంటివి తీసుకోండి. ఇవి మెదడు శక్తిని పెంచే సహజమైన ఆయుర్వేద మూలికలుగా పనిచేస్తాయి.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: