నిద్రలేవగానే ఈ పనులు చేస్తే రోజంతా హుషారే

Monday, January 27, 2025 06:00 AM Lifestyle
నిద్రలేవగానే ఈ పనులు చేస్తే రోజంతా హుషారే

ప్రతి రోజు ఉదయం నిద్రలేవగానే కొన్ని పనులు చేస్తే చాలు రోజంతా హుషారుగా ఉండవచ్చు. ఉదయం నిద్రలేవగానే ఫోన్లకు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి మన మూడ్ ను మారుస్తాయని, అందుకే ఉదయం నిద్రలేవగానే వాటి జోలికి వెళ్లకూడదంటున్నారు.

అద్దంలో చూసుకోండి :నిద్రలేవగానే ఏదైనా ఒక జోక్ చదవండి. తర్వాత మీ ముఖాన్ని అద్దంలో 20 సెకన్ల పాటు చూసుకొని నవ్వండి. నిద్రలేవగానే వెంటనే ఇంట్లో అందరికీ, కుదిరితో పక్కనున్న వారికి గుడ్మార్నింగ్ చెప్పండి. ఇది మీ మూడ్ను ఉత్సాహంగా ఉంచేలా చేస్తుంది. నిద్రలేవగానే కొన్ని నిమిషాల పాటు నిశ్శబ్దంగా కళ్లు మూసుకుని కూర్చోని, ఊపిరి బాగా లోపలికి పీల్చుకుని వదిలితే ఈ శ్వాసక్రియ మీ మూడ్ను ఉత్సాహంగా ఉంచుతుంది.

నిమ్మకాయ నీళ్లు : నిద్రలేవగానే చాలా మందికి టీ లేదా కాఫీ తాగుతుంటారు. వాటి బదులు నిమ్మకాయ నీళ్లు లేదా మంచినీళ్లు తీసుకోవడం మంచిదని వైద్యులు చెపుతున్నారు. 

పండ్లతో ఎంతో మేలు : ఉదయం పూట పండ్లను తింటే ఎంతో మేలని నిపుణులు చెబుతున్నారు. పండ్లలో ఉండే న్యూట్రీషిన్స్, ప్రోటీన్స్ వ్యాధి నిరోధకశక్తిని పెంచి శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది.

వ్యాయమం చేయండి : నిద్రలేచిన తర్వాత వ్యాయమం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. రోజు హాయిగా ఉండడానికి ఉదయం పూట మీకు నచ్చిన సంగీతాన్ని వినండి. సంగీతం మనలో చైతన్యం పెంచుతుంది. ప్రతి రోజు నిద్రలేవగానే ఇలాంటివి చేస్తే హుషారుగా ఉండడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: