ఉదయం లేవగానే కచ్చితంగా చేయాల్సిన పనులు..
_(18)-1739497534.jpeg)
ఉదయం లేవగానే చాలామంది ఫోన్లు పట్టుకుని కూర్చుంటారు. దీంతో చాలా సమయం వృథా అవుతుంది. అందుకే ఉదయం నిద్రలేచిన తరవాత ఫోన్ ఉపయోగించకూడదు. రోజుని ఎంత ఉషారుగా మొదలు పెడితే ఫలితాలు అంత విజయవంతంగా వస్తాయి. నిద్రలేచిన వెంటనే రెండు గ్లాసుల నీళ్లు తాగండి. ఇది మీరు రోజంతా ఉత్సాహంగా, ఆరోగ్యంగా పని చేసేందుకు ఉపయోగపడుతుంది. మీరు ఎక్కడికి వెళ్లినా వాటర్ బాటిల్ వెంట పెట్టుకుని వెళ్లండి.
ఓ మైలు దూరం వరకూ జాగింగ్ చేయండి. దీంతో మీ కండరాలకు శక్తి చేకూరుతుంది. శరీరం ఫిట్గా ఉంటుంది. మెదడు చురుగ్గా పని చేస్తుంది. ప్రాణాయామం, యోగా చేయండి. తరచూ చేస్తూ ఉండటం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వైరస్ ల బారిన పడకుండా ఉండేందుకు ఊపిరి సులువుగా తీసుకునేందుకు ఆవిరి పట్టుకోవడం మంచి పద్ధతి. అది చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఆరోజు చేయాల్సిన పనులన్నిటినీ డైరీలో రాసుకోండి. అల్పాహారం తప్పకుండా చేయండి. సరైన సమయానికి ఆహారం తీసుకున్నపుడే పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయగలరు. మీ రోజుని ఆనందంతో, విశ్వాసంతో ఆరంభించండి. విజయం తప్పక మీ సొంతమవుతుంది.