ఆమెకు 18.. అతనికి 50.. పారిపోయి ప్రేమ పెళ్లి చేసుకున్నారు!

ఓ 50 ఏళ్ల వ్యక్తి, 18 ఏళ్ల మైనర్ బాలికను ప్రేమించాడు. బాలిక కూడా అతన్ని ప్రేమించింది. లేచి పోయి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈ ప్రేమకథా చిత్రం కర్ణాటకలోని హుబ్లీలో వెలుగు చూసింది. కర్ణాటకలోని హుబ్లీకి చెందిన ప్రకాశ్ అనే 50 ఏళ్ల వ్యక్తి, అదే ప్రాంతానికి చెందిన కరీష్మా అనే బాలికను ప్రేమించాడు. ఆమె కూడా ఓకే చెప్పింది. ప్రకాశ్‌కు అప్పటికే వివాహనమై, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా కూడా వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అలా ఓ రెండేళ్ల పాటు వీరి ప్రేమ వ్యవహారం సాగింది. విషయం బాలిక ఇంట్లో తెలిసి, ఈ విపరీత పొకడలు ఎక్కడికి దారి తీస్తాయో అని భయపడి, బాలికను మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లోని అమ్మమ్మ ఇంటికి పంపించారు.
కానీ, నెలన్నర క్రితం అంటే జనవరి 3న ఆ బాలిక కనిపిచకుండా పోయింది. దీంతో బాలిక తల్లిదండ్రులు, ఇది కచ్చితంగా ప్రకాశ్ పనే అయి ఉంటుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలిక కిడ్నాప్ కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు. అయితే తాజాగా ప్రకాశ్, కరీష్మా ఓ గుడిలో దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. ఇన్ని రోజులు కర్మిషా మైనర్ కావడంతో పెళ్లి చేసుకోకుండా ఆగిన ప్రకాశ్, 18 ఏళ్ల నిండిన తర్వాత ఆమెను ఈ మధ్యనే పెళ్లి చేసుకొని, ఆ విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేశాడు. ఇలా స్టోరీని మించి సాగిన ఈ 18 వెడ్స్ 50 లవ్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే నెటిజన్లు మాత్రం ఈ విషయంలో ప్రకాశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ పెళ్లి అయి, ఇద్దరు పిల్లలకు తండ్రి అయి ఉండి, ఓ మైనర్ బాలికను ప్రేమించడం ఏంటని మండిపడుతున్నారు.