ఏపీ ప్రజలకు రూ.78 వేలు సబ్సిడీ
_(31)-1740278222.jpeg)
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం సూర్యఘర్ పథకాన్ని ఏపీలో అమలు చేసేందుకు పరిపాలనా అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలో 20 లక్షల ఎస్సీ, ఎస్టీ గృహాలపై సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిస్కంలను ఆదేశించింది.
మూడు కిలోవాట్ల ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు రూ.1.45 లక్షల ఖర్చు అయితే అందులో కేంద్రం రూ.78 వేలు సబ్సిడీ ఇస్తుంది. మిగిలిన మొత్తాన్ని రుణంగా సమకూరుస్తుంది. దీని కోసం pmsuryaghar.gov.in వెబ్‌సైట్‌లో రాష్ట్రం, విద్యుత్ సరఫరా కంపెనీని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత విద్యుత్ కనెక్షన్ నంబర్, ఫోన్ నంబర్, మెయిల్ ఐడీని ఎంటర్ చేసి రిజిస్ట్రర్ చేసుకోవాలి. అక్కడ రూఫ్‌టాప్ సోలార్ కోసం అప్లై చేసుకోవాలి. డిస్కం నుంచి అనుమతి వచ్చాక సోలార్ ప్లాంట్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని, ఆ వివరాలను పోర్టల్‌లో నమోదు చేసి మీటర్ కోసం దరఖాస్తు చేయాలి. అది కూడా ఇన్‌స్టాల్ చేశాక అధికారులు తనిఖీలు చేసి కమిషనింగ్ సర్టిఫికెట్ ఇస్తారు. బ్యాంకు ఖాతా వివరాలతో పాటు క్యాన్సిల్డ్ చెక్‌ను సబ్మిట్ చేస్తే 30 రోజుల్లో సబ్సిడీ జమ అవుతుంది.