బ్యాంకులకు వరుస సెలవులు.. పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం
Saturday, March 29, 2025 06:48 AM News
_(22)-1743211087.jpeg)
ఈనెల 30న ఉగాది, 31న రంజాన్, ఏప్రిల్ 1న యాన్యువల్ క్లోజింగ్ డే సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉండనుంది. బ్యాంకులకు వరుస సెలవులు ఉండనున్న నేపథ్యంలో పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ డబ్బులను ప్రభుత్వం శనివారమే బ్యాంకుల్లో జమ చేయనుంది.
ఎలాంటి జాప్యం లేకుండా శనివారమే బ్యాంకుల నుంచి నగదును విత్ డ్రా చేసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో యధావిధిగా ఏప్రిల్ 1న సిబ్బంది ఆయా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లను అందజేయనున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: