అమెరికాలో కులం పేరుతో భారీ కుంభకోణం... తెలుగు ఉద్యోగులను తొలగించిన ఆపిల్

Tuesday, January 7, 2025 10:48 PM News
అమెరికాలో కులం పేరుతో భారీ కుంభకోణం... తెలుగు ఉద్యోగులను తొలగించిన ఆపిల్

అమెరికాలో 185 మంది తెలుగు వారు తమ ఉద్యోగాలు కోల్పోయారు. దీనికి కారణం కంపెనీ లేఆఫ్స్ కాదు.. వారంతా కులం పేరు చెప్పి భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. ప్రపంచంలో అతి పెద్ద టెక్ కంపెనీ యాపిల్‌లో సీనియర్ మేనేజర్ కేడర్ నుంచి ఎంట్రీ లెవల్ ఎగ్జిక్యూటివ్‌ల వరకూ అందరూ ఇందులో  భాగస్వామ్యం అయ్యారట. అమెరికాలో కంపెనీల ట్యాక్స్ లెక్కలు చూసే ఇంటర్‌నల్ రెవెన్యూ సర్వీస్(IRS) వీళ్ల గుట్టును రట్టు చేసింది. యూఎస్ బే ఏరియాలో యాపిల్‌ ఆఫీస్‌లో 185 మంది ఉద్యోగులు కులం పేరు చెప్పి వందల డాలర్లు విరాళాలుగా సేకరించారు.

అమెరికాలో ఉన్న తెలుగు వారంతా TANA తెలుగు అసోసియేషన్ ఫర్ నార్త్ అమెరికా, NATA నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్, ATA అమెరికన్ తెలుగు అసోసియేషన్, APTA అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియేషన్, NATS నార్త్ అమెరికా తెలుగు సొసైటీ, NIRVA వంటి సంఘాలుగా ఏర్పడ్డారు. అమెరికాలో కాపులు, కమ్మలు, రెడ్లు కుల సంఘాలుగా ఏర్పడి ఈ సంస్థలను నడిపిస్తాయి. ప్రతి ఏటా ఈ సంఘాలు సమేశాలు, సభలు నిర్వహిస్తాయి. అయితే యాపిల్ కార్పొరేట్ ఫండ్ కింద ఇచ్చే విరాళాలను ఈ తెలుగు సంఘాల్లో ఉన్న ఉద్యోగులు దుర్వినియోగం చేశారు. యాపిల్ కంపెనీ మ్యాచింగ్ కార్పొరేట్ గ్రాంట్స్ అని ఛారిటీ సంస్థలకు విరాళాలు ఇస్తోంది. ఆ డబ్బుపై పన్ను కూడా విధించదు అమెరికా ప్రభుత్వం. ఈ డబ్బును అందులో పని చేసే తెలుగువాళ్లు విరాళాల పేరు చెప్పి సేకరించి సొంత ప్రయోజనాలకు వాడుకున్నారని IRS నివేదిక ఇచ్చింది.

బే ఏరియాలో యాపిల్‌ ఆఫీస్‌లో పని చేసే 185 మంది ఈ నిధులను వసూలు చేసి వారి సొంత అవసరాలకు వాడుకున్నారట. ఈ విషయం IRS చేసిన విచారణలో తేలింది. దీంతో యాపిల్ సంస్థకు చెడ్డ పేరు వచ్చింది. వెంటనే మ్యాచింగ్ కార్పొరేట్ గ్రాంట్స్‌ను దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకుంది. వారిని ఉద్యోగాల నుంచి తొలగించింది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ వ్యవహారంపై మండిపడుతున్నారు. డబ్బులకు కక్కుర్తిపడి, కులం పేరు చెప్పి అమెరికాలో తెలుగు వాళ్ల పరువుతీశారని కొందరు జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

For All Tech Queries Please Click Here..!
Topics: