కేంద్ర మంత్రులను కలిసిన అవినాష్ రెడ్డి
Tuesday, February 11, 2025 08:01 AM News

ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను, కేంద్ర అణుశక్తి సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ ను కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి కలిశారు. చెన్నై-అహ్మదాబాద్ మధ్య నడిచే వారపు రైలు ( రైలు నంబర్ -22919/22920) రైల్వే ప్రయాణికుల ప్రయోజనార్థం చెన్నై నుండి అహ్మదాబాద్ కు వెళ్లే రైళ్లను కడప రైల్వే స్టేషన్‌లో తప్పకుండా ఆపేలాగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రస్తుతం తిరుపతి నుండి షిరిడి నగరాలకు వారానికి ఒక్కసారి రైల్ సౌకర్యం ఉందని, అలాకాకుండా భక్తుల సౌకర్యార్థం ప్రతిరోజు తిరుపతి నుండి షిరిడీకి రైలును ఎర్పాటు చేయాలి అని కోరారు. అనంతరం కేంద్ర అణుశక్తి సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ ను కలిసి UCILలో నెలకొన్న సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: