సినిమాలు లేవని బిజినెస్ చేశాడు.. 1000 కోట్ల మోసంతో అడ్డంగా బుక్కయిన హీరో వేణు
_(6)-1738846995.jpeg)
తెలుగు నటుడు వేణుపై కేసు నమోదయింది. వేణు, హేమలత, పాతూరి ప్రవీణ్, ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ భాస్కర్ రావు, శ్రీవాణి లు కలిసి ఉత్తరాఖండ్ లోని జలవిద్యుత్ ప్రాజెక్టు కి సంబంధించిన కొన్ని పనులను చేయడం కోసం తెహ్రి డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ దక్కించుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడం కోసం సబ్ కాంట్రాక్టార్లుగా బంజారాహిల్స్ లోని స్వాతి కన్స్ట్రక్షన్స్, రిత్విక్ కన్స్ట్రక్షన్స్ ని తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు మధ్యలోనే స్వాతి కన్స్ట్రక్షన్స్ ఆ పని చేయలేమని తప్పుకున్నారు.దాంతో 2002లో కేవలం రిత్విక్ కన్స్ట్రక్షన్స్ సంస్థ మాత్రమే ఈ పనులు మొదలు పెట్టింది. సడన్ గా టీహెచ్డీ, ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ సంస్థల మధ్య విభేదాలు తలెత్తడంతో ఈ రెండు సంస్థలు కలిసి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు ఇప్పటికే పీహెచ్డీ ఖాతాలో ఉత్తరాఖండ్ జలవిద్యుత్ ప్రాజెక్టులోని కొన్ని పనుల కోసం1010.25 కోట్లు టిహెచ్ డి ఖాతాలో జమ చేశారని చెబుతున్నారు. కానీ సబ్ కాంట్రాక్టర్లుగా తీసుకున్న రిత్విక్ కన్స్ట్రక్షన్ తో చేసుకున్న ఒప్పందాన్ని ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ నిర్వాకులతోపాటు హీరో తొట్టెంపుడి వేణు కూడా మధ్యలోనే రద్దు చేసినట్లు సమాచారం. దాంతో ఫైర్ అయిపోయిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ ఎండి రవికృష్ణ వెంటనే బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టాడు. దాంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వీరిపై పోలీస్ కేసు నమోదు అయింది. నాంపల్లిలోని రెండో అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశం ప్రకారం ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ నిర్వాహకులతో పాటు హీరో తోట్టెంపూడి వేణు పై కూడా కేసు నమోదు అయింది.
వేణు హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన స్వయంవరం సినిమాతో స్టార్ అయ్యారు. ఇక తొట్టెంపూడి వేణు కేవలం సినిమాల్లో హీరోగానే కాకుండా పలు స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేశారు.అలా ఒకానొక సమయంలో ఈయన ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకొని వరుస సినిమాల్లో హీరో అవకాశాలు అందుకున్నారు.