సెప్టెంబర్ 2025లో భూమిపై గ్రహాంతరవాసుల దండయాత్ర

2025లో ఈ ఐదు రోజుల్లో విపత్కర సంఘటనలు చోటు చేసుకుంటాయని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది.
ఎల్విస్ థాంప్సన్ అనే వ్యక్తి ఈ ఏడాది జనవరి 1న తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేస్తూ 2025లో ఈ ఐదు తేదీల్లో విపత్తులు సంభవిస్తాయని అంచనా వేశాడు. ఏప్రిల్ 6, 2025న అమెరికాలోని ఒక్లహోమాను తాకిన మొదటి హరికేన్ గంటకు 1046 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు దానిని నాశనం చేస్తాయని తెలిపారు. మే 27న రెండవ అమెరికన్ అంతర్యుద్ధం ప్రారంభమవుతుందని, ఇది టెక్సాస్ విడిపోవడానికి, అణ్వాయుధాలతో కూడిన ప్రపంచ సంఘర్షణకు దారితీస్తుందని, చివరికి యునైటెడ్ స్టేట్స్ నాశనానికి దారితీస్తుందని కూడా పేర్కొన్నారు.
థాంప్సన్ సెప్టెంబర్ 2025 లో గ్రహాంతరవాసుల సందర్శన ఉంటుందని తెలిపారు. ఛాంపియన్ అనే గ్రహాంతర వాసి సెప్టెంబర్ 1, 2025న వస్తుందని, 12 వేల మంది మానవులను వారి భద్రత కోసం వేరే గ్రహానికి తీసుకెళ్తాడని అతను అంచనా వేశాడు. భూమికి హాని కలిగించాలని ఉద్దేశించిన గ్రహాంతరవాసుల గురించి కూడా ఆయన హెచ్చరించాడు. సెప్టెంబర్ 19, 2025న యునైటెడ్ స్టేట్స్ తూర్పు తీరాన్ని ఒక పెద్ద తుఫాను తాకుతుందని థాంప్సన్ గుర్తించారు. చివరగా నవంబర్ 3, 2025న, నీలి తిమింగలం కంటే ఆరు రెట్లు పెద్దదిగా ఉండే సెరీన్ క్రౌన్ అనే భారీ సముద్ర జీవిని పసిఫిక్ మహాసముద్రంలో కనుగొంటామని చెప్పారు.