ఆస్పత్రికి వచ్చిన రోగి ఎక్స్ రే చూసి వైద్యులు షాక్

అనారోగ్యం అంటూ ఆస్పత్రికి వచ్చిన పేషంట్ ఎక్స్ రే చూసి వైద్యులు షాక్ అయ్యారు. మెడికల్ కేస్ స్టడీలో భాగంగా పరాన్నజీవులు నిండిన ఒక ఎక్స్‌రే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సరిగ్గా ఉడకని పంది మాంసం తిని ఓ వ్యక్తి శరీరమంతటా కాల్సిఫైడ్ పరాన్నజీవులు ఫామ్ అయ్యాయి. ఇలా పరాన్నజీవులు నిండిన ఈ వ్యాధిని 'సిస్టిసెర్కోసిస్' వ్యాధి అని పిలుస్తారని డాక్టర్ శ్యామ్ ఎక్స్ లో పేర్కొన్నారు. లార్వా తిత్తులు సోకిన పచ్చి లేదా ఉడకని పంది మాంసం తినడం ద్వారా పరాన్నజీవులు మనుషులకు సోకుతాయని పేర్కొన్నారు. ఈ టేప్‌వార్మ్‌లు మానవ శరీరంలో కొద్ది వారాల్లో పరిపక్వత చెంది గుడ్లు పెట్టి టేప్‌వార్మ్‌లను ఫామ్ చేస్తాయి.
టేప్‌వార్మ్ లార్వాలు మానవ శరీరంలోని మృదు కణజాలాలలోకి చేరి వృద్ది చెందుతాయి. ఇక ఈ వ్యాధి సోకినా వ్యక్తులు వాడిన వస్తువులు లేదా బాత్‌రూమ్‌ను వేరేవాళ్లు ఉపయోగించకూడదని వైద్యులు చెబుతున్నారు. అలా చేస్తే సిస్టిసెర్కోసిస్ వ్యాధి వేరొకరికి సోకుతుందని తెలిపారు. ఈ ఇన్ఫెక్షన్ వల్ల కండరాలు, చర్మం దెబ్బతినడం, మెదడు మొద్దుబారిపోవడం ఉంటాయని తెలిపారు.