ట్రంప్ దెబ్బకు అమెరికాను వీడుతున్న భారతీయులు
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన విద్యార్థులకు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు చుక్కలు చూపిస్తున్నాయి. ఉన్నత చదువుల కోసం తల్లిదండ్రులు అప్పు చేసి అమెరికాకు పంపించారని, వారికి మరింత భారం కావొద్దనే ఉద్దేశంతో చిన్న చిన్న పనులు చేసుకుని బతుకుతున్న వారిపై ట్రంప్ కొరడా ఝళిపిస్తాడేమోననే భయం వెంటాడుతోంది.
ఉన్నత చదువుల కోసం వచ్చిన విదేశీయులు ఇలా పార్ట్ టైమ్ ఉద్యోగం చేయడం చట్టవిరుద్ధం.. స్టూడెంట్ వీసా మీద అమెరికాలో అడుగుపెట్టిన వారు ఉద్యోగం చేయడానికి ఇమిగ్రేషన్ చట్టాలు ఒప్పుకోవు. చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు వారి యూనివర్సిటీలో (ఆన్ క్యాంపస్) వారానికి 20 గంటల వరకు పనిచేసుకునే వెసులుబాటు మాత్రం ఉంటుంది. అమెరికా పౌరసత్వం కోసం భారత మహిళలు దారుణం, 9 నెలలకు పుట్టాల్సిన బిడ్డను మధ్యలోనే సీజేరియన్ ద్వారా బయటకు తెచ్చేందుకు ఆస్పత్రులకు పరుగులు అయితే, వర్సిటీలో వందలాదిగా ఉండే విద్యార్థులు అందరికీ పని దొరకదు. దీంతో చాలామంది అనధికారికంగా బయట హోటళ్లు, పెట్రోల్ బంక్ లు తదితర వాటిలో పార్ట్ టైమ్ చేస్తుంటారు.
విదేశీ విద్యార్థులు ఇలా పనిచేస్తూ పట్టుబడితే ఇమిగ్రేషన్ అధికారులు వారి స్టూడెంట్ వీసా రద్దు చేసి స్వదేశానికి పంపిస్తారు. ఆ తర్వాత మళ్లీ విద్యార్థిగా అమెరికాలో అడుగుపెట్టే అవకాశం దాదాపుగా ఉండదు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు వారికి శాపంలా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. యుఎస్‌లో అక్రమంగా నివసిస్తున్న భారతీయుల్ని చట్టబద్దంగా భారత్‌కు తీసుకువస్తా అని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కీలక వ్యాఖ్యలు ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్న భారత విద్యార్థులను ఈ భయమే వెంటాడుతోంది.