ఏపీలో లిక్కర్ డోర్ డెలివరీ
Thursday, February 13, 2025 09:30 AM News
_(13)-1739417545.jpeg)
మద్యం సిండికేట్ ముఠా మద్యం అమ్మకాలను పెంచడానికి కొత్త ప్రణాళికను రూపొందించింది. ప్రతిరోజూ వాహనాల్లో మద్యం తీసుకెళ్లి చుట్టుపక్కల గ్రామాల్లో విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎక్సైజ్ అధికారులు వారిపై నిఘా ఉంచి మద్యం డోర్ డెలివరీ గుట్టు రట్టు చేశారు. ఈ సంఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది.
కుక్కునూరు మండలంలో భారీ మొత్తంలో మద్యం బాటిళ్లను వాహనాల్లో యథేచ్ఛగా అమ్ముతున్నారు. మండలంలోని బయ్యనగూడేనికి చెందిన ఒక వ్యక్తి జంగారెడ్డిగూడెం ప్రాంతంలోని మద్యం సిండికేట్ తరపున ప్రతిరోజూ వాహనాల్లో మద్యం తీసుకెళ్లి చుట్టుపక్కల గ్రామాల్లో విక్రయిస్తున్నాడు. దీన్ని కొనుగోలు చేసే వారు గ్రామాల్లో అధిక ధరలకు అమ్ముతున్నట్లు సమాచారం. ఈ అమ్మకం వీడియో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు దీనిపై దృష్టి సారించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: